Others

సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజమైన
సన్మానమంటే...
సభా సదనంలో
విజ్ఞుల సమక్షాన
వ్యక్తి ప్రతిభకు జరిపే
ఓ పట్ట్భాషేకం!

కీర్తి సింహాసనాన్ని ఎక్కించి
ఊహాలోకాల్లోకి
లాక్కొని వెళ్ళే
ఓ అపురూప సన్నివేశం!

స్వీకర్త వదనమనే పూదోటలో..
ముసిముసి నవ్వులు పువ్వులై
వేదికకు...
వెలుగులు పంచుతాయి!

తలపాగా.. పూలదండ..
శాలువ... జ్ఞాపిక...
పుష్పగుచ్ఛం.. ప్రశంసాపత్రం
ఒక్కటేమిటి?
ఇలా వివిధ రూపాల్లో
ఆభరణాలై గ్రహీతను
ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే...
హృదయాకాశాన హరివిల్లులు
వెల్లివిరుస్తాయి

అక్షరాలకు
అందని అనుభూతులు
అంతరంగాన
గిలిగింతలు పెడుతుంటే...
మనసు ముంగిట్లో
ఆనందపు రంగవల్లులు
కొలువుదీరుతాయి!

అయితే
కలికాలాన్ని తలపిస్తూ
సత్కారాన్ని సంతలో
సరుకులా సొంతం చేసుకుంటే
అది మది సాగరాన
నీటి బుడగలా మురిపిస్తుందే తప్ప
హృది గదిలో నిలువదు
కలకాలం!!

- దాస్యం సేనాధిపతి, 9440525544