Others

నిప్పుకణిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుద్ధం ముగిసిన చోట
మరో ఆంతరంగిక యుద్ధం జరుగుతుంది

స్వప్నాలు ఎగిరిపోతుంటే
మంచు చరియలు విరిగిపడి కప్పబడిన
దేహాల్లోంచి ధైర్యంగా నడిచిన
విజయకేతనమే కలల సాకారం

తూటాలను గుండెల్లో నాటిన
సైనిక సాహసమే
సరిహద్దుల వెంట పహారా కాస్తుంది
మెరుపు దాడుల వెంట
రాజనీతి బోధపడుతుంది

ఆక్రమితమెప్పుడూ ముంపునకు
దారితెరిచే ఉంటుంది

చెమట చుక్కల వెంట
రక్తపు మడుగుల వెంట
దేశ దేహాల భత్రలూ ముడిపడివుంటాయి

కవ్వింపు చర్యల వెంట
తూటాలు దూకుతుంటాయి

సిద్ధాంతాలు వేరు వాస్తవాలు వేరు
ఖననమైన ఆశల్ని ఎలుగెత్తటానికి
నరమేధమే సిద్ధం కావాల్సిన అవసరం లేదు

నిరసన నిప్పుకణికలు
నిజాన్ని వెదజల్లుతాయి

అయనా
ఆక్రమణ ఆజ్యం పోసిన చోట
చల్లబడ్డ యుద్ధమేఘాలు
మళ్లీ గర్జిస్తుంటాయి

- గవిడి శ్రీనివాస్, 9966550601