Others

ముదిగొండ శివప్రసాద్‌కు గుప్త ఫౌండేషన్ కృష్ణమూర్తి పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన గుప్త ఫౌండేషన్ ప్రతి ఏటా ప్రకటించే కృష్ణమూర్తి సాహితీ పురస్కారానికి 2019 సంవత్సరానికి గాను చారిత్రక నవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్ ఎంపికయ్యారు. ఈ పురస్కారం కింద రెండులక్షల నగదు, సత్కారం జరుగుతుందని గుప్త ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 31న ఏలూరులో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును బహూకరించనుంది. గతంలో కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, ప్రొ. బేతవోలు రామబ్రహ్మం, గుంటూరు శేషేంద్రశర్మ, మాలతీచందూర్, ఏలూరుపాటి అనంతరామయ్య, ప్రొ. శలాక రఘునాథ శర్మ, దాశరథి రంగాచార్య, చర్ల గణపతిశాస్ర్తి, ప్రొ. చేకూరి రామారావు, కోవెల సంపత్కుమారాచార్య, వేల్చూరి నారాయణరావు, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ వంటి సాహితీమూర్తులు ఈ అవార్డును అందుకున్నారు.