Others

వసంత కోకిల ఎడారిలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుక్లపక్షపు కడపటి రోజుల్లో
వెనె్నల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లల్ని
వనె్నచినె్నల సొగుసుల్ని గమనించా
లేదు అందులో దొరకలేదు!

కృష్ణపక్షపు నిశి రోజుల్లో
ఉగాదుల్ని ఉషసుల్ని
చీకట్లో సంచరించు అభిసారికల్ని
తదేకంగా వెదికా,
లేదు అందులో దొరకలేదు

వెలిగే సమిధల్లో, కారే అశ్రువుల్లో
మార్మోగే భువన ఘోషల్లో
తూట్లుగా పొడిచిన శరాఘాతాల్లో
తెగ వెతికా, లేదు అందులో దొరకలేదు!

అందమైన విశ్వంభరలో
అవధిలేని ఆశల్లో
అంతులేని మానవమేధలో
లేదు అందులో దొరకలేదు!

వసంతాన తరులపై వాలి కవి కోకిలలు
అలరుల విరితేనెలు గ్రోలి కమ్మగా కూస్తుంటే!
నా అక్షరాలు వసంతములోనూ
ఎడారి కోయలలై!
ఇసుక తెనె్నల్లో, వేడి గాడ్పుల్లో, శూన్యములో..

- రవికిశోర్ పెంట్రాల, లాంగ్లీ, లండన్