Others

అతి సర్వత్ర వర్జయేత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసివాడి వచ్చీరాని మాటలు
ఊరీ ఊరని ఊరగాయ
చేమరీ చేమరని పెరుగు
నవీ నవ్వని చిరునవ్వు
హా! హా! కారం లేని మందస్మిత వదనం
అధరము గదలీ గదలక
మధురంబగు భాషణం.

తామరాకు మీది నీటి బిందువులాంటి
అతి చనువు గాని చనువు,
దురాశగాని, అత్యాశలేని ఆశ,
మందలింపులో మానవత్వం,
అందీ అందని అందమే ఆనందం.
అందీ అందని అందాన్ని
అందించుకునే ప్రయత్నం
విరిసీ విరియని పువ్వేఅందం.

కరడు గట్టిన ముతక హాస్యం వద్దు
కప్పిఉంచబడే ముచ్చటైన హాస్య నగవు ముద్దు
శృతిమించని శృంగార చిత్రీకరణ
ధూర్త లక్షణం అతివినయం!

అతిభక్తి, అత్యభిమానం,
భగవత్ బేరాల అనుగ్రహం,
ఆకృతులకై అత్యుత్సాహం.
వేదారణ్యపు భీంరావు, గాంధీవిగ్రహాదిగ
వంగ రాష్టప్రు ఈశ్వరభాయ్ విద్యాసాగరుని
విగ్రహాల విధ్వంసం.
అధినాయకునిపై అత్యభిమానం,
అవధులుదాటిన అభిమానంపై
అవమానం దాడిచేస్తే,
ఉరుమురిమి మంగలం మీద పడితే
నిగ్రహం కోల్పోయి విగ్రహంపై ఆగ్రహం
అధర వ్యక్తీకరణ అశక్తుని ఆగ్రహం
విధ్వంస రచన వివేక రహిత చర్య.

అతిసర్వత్ర వర్జయేత్ అనుకుంటే
అందరిలో గుడి వుందనుకుంటే
దేహమేరా దేవాలయమనుకుంటే
మా మదిలోనే మా నాయకుడనుకుంటే
హృదయ ఫలకంపై విగ్రహ ప్రతిష్ఠ
హృదయంగమమే కదా.

- వేదం సూర్యప్రకాశం సెల్: 9866142006