Others

ఎదిరిచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇసుకేస్తే రాలనట్టు రద్దీగా బస్సులు
ఎగిలివారిన నుంచి అద్మరాత్రిదాక
వచ్చేవాళ్లతోటి పోయేటోల్లతోటి
నిత్యము గడ్తీగా వుంటది

కొన్ని ఎదిరిచూసే మతలబులకు
ఇంకొన్ని బతుకుదెరువును
ఎంకులాటకు ఆలవాలమైతది

రూపాయ తరుముతుండగా
దేశాలకు దేశాలు పట్టి పోయేటందుకు
మజిలీ అవుతుంది

గొంతులో దుఃఖం అదిమిపెట్టుకొని
అప్పగింతలు చెప్పే తల్లులకు
పాలు మర్వని పిల్లల్ని
లోకం తెల్వని భార్యనూ
విడువలేక కండ్లల్లకెళ్లి నీళ్లు దుంకుతుంటయ

రేపుమీద కొండంత ఆశతోటి
కానని రాజ్యానికి తెరువు దేవులాటల్లో
వలపోతల్లో కన్నీటి జాడయతుంది

పేపర్‌ను ఇంటింటికి
మోసుకుపోయే బాల సూర్యుల్లు
సైకిల్‌పై అందీ అందని కాళ్లతో
యాతనపడే పాలబుగ్గలు..

- కొలిపాక శోభారాణి, 9491367409