Others

ఖాళీపన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇవాళ మనస్సు
అలలు లేని చెరువులా వుంది
ఖాళీ కుండలా
చీకటిగా వుంది

ఎవరైనా మిత్రుడ్ని రమ్మంటేనో
కాని మనస్సుకతడు కావాల్నో వద్దో!
నేనే ఎవరింటికైనా వెళ్లివస్తేనో
ఇదీ కష్టమే.
అక్కడ నా కోసం
అనుకూల పవనాలు వీస్తున్నాయో లేదో!
‘ఆయాయే ఆప్ కీ జరూరత్ హై’ అనే పాట
యూట్యూబ్‌లో మాయమైంది
మళ్లీ వెతికి తియ్యాలి.

ఎవరినైనా కలిస్తే
ప్రవహించే నదిని కలుస్తున్నట్టుండాలి
నిన్నటి భావనలే
ఇవాళ సూర్యరశ్మిలో అద్ది తీసినట్టుండాలి
పాత సంగతులకే
కొత్త వ్యాఖ్యానం స్ఫురించాలి
మనస్సు అస్థిమితంగా వుంది

పక్కింటి ముందు
అల్లుకున్న తీగ కనిపించింది
దానికి ఆ మధ్య రెండాకులే వుండేవి
ఇవాళ అసంఖ్యాక పత్రాలలో
హరిత మనోహరంగా కదుల్తుంది
అక్కడక్కడ
ఒకటి రెండు పువ్వులు కనిపిస్తున్నాయ
ఇప్పుడర్థమైంది
కవితకు వేళయ్యందని!

- డా. ఎన్. గోపి