Others

ధ్రువతార అక్కినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ చలనచిత్ర చరిత్రలో అక్కినేని నటించినన్ని విషాదభరిత చిత్రాలు మరే నటుడూ చేయలేదు. విషాద
పాత్రలకు ప్రాణం పోసి మెప్పించడంలో నాటికి, నేటికి, ఏనాటికీ
అక్కినేనికి
అక్కినేనే సాటి.

(సెప్టెంబర్ 20 అక్కినేని జయంతి సందర్భంగా)

ప్రపంచ చలన చిత్ర పటంపై తెలుగువాడి సత్తా లిఖించిన గొప్ప నటుడు అక్కినేని. మహోన్నత శిఖరాలు చేరుకోవడానికి అక్కినేని పడిన శ్రమ, కృషి.. తరువాతి తరాలకు ఎప్పటికీ ఆదర్శనీయమే. కనీసం నాలుగవ తరగతి కూడా చదవుకోని అక్కినేని.. నటనలో ఉద్గంథ్రాలే రచించాడు. అందుకు అష్టకష్టాలు పడ్డాడు. అవమానాలు భరించాడు. సవాళ్లు స్వీకరించాడు. గెలిచి పదిమందికి ఆదర్శప్రాయుడయ్యాడు. అక్కినేని చలన చిత్ర రంగంలోకి అడుగుపెట్టేనాటికి (1941) రంగస్థల, సినీ నటులపట్ల చులకన భావం ఉండేది. అటువంటి సినిమా రంగానికి, నటీనటులకు విశిష్టమైన గౌరవం తెచ్చిన సంస్కర్తగా అక్కినేనిని గుర్తు చేసుకోవటం అతిశయం కాదు.
పౌరాణికాలతో హీరోగా (1944 సీతారామజననం) రంగ ప్రవేశం చేసిన అక్కినేని జానపద చిత్రాలతో అద్భుత విజయాలు సాధించారు. అటుపై సాంఘిక, చారిత్రాత్మక, భక్తిరస చిత్రాల్లో తనదైన శైలితో మెప్పించారు. ఇక ప్రేమ కథా చిత్రాలైతే ఆయన నటనకు జనం నీరాజనం పట్టారు. 1949లో లైలా మజ్ను చిత్రంలో మజ్ను పాత్రకు ఎంపికవడం దగ్గరనుంచి మొదలైన విమర్శలు, తరువాత పలు చిత్రాలలో ఆయన పాత్రల ఎంపికల గురించి కొనసాగాయి. దేవదాసు (1953), విప్రనారాయణ (1954), మహాకవి కాళిదాసు (1960) వంటి అనేక పాత్రలకు అక్కినేని పనికిరాడనే విమర్శలు వచ్చినపుడు ఆయన కుంగిపోలేదు. ఆయా చిత్రాలు విడుదలై విజయవిహారం చేస్తున్నపుడు పొంగిపోలేదు.
విషాద పాత్రలు పోషించడంలో అక్కినేనికి సౌత్ ఇండియా ట్రాజెడి కింగ్ అనే పేరు. ఉత్తరాదికి వచ్చేసరికి ఈ ఖ్యాతి దిలీప్‌కుమార్‌ది. అలాంటి సాటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతే దేవదాసు హిందీలో చేసిన తరువాత -అక్కినేని నటనలో ఐదోవంతు కూడా చేయలేకపయానంటూ శభాష్ అక్కినేని అని కొనియాడారు. దేవదాసును బంగ్లాదేశ్, పాకిస్తానుల్లో నిర్మించినా తెలుగు దేవదాసే అగ్రతాంబూలం అందుకుందంటే అక్కినేని తన నటనతో దేశ గౌరవాన్ని ఏ స్థాయికి తీసుకువెళ్ళారో అర్థం చేసుకోవచ్చు. 1971లో డి.రామానాయుడు నిర్మించిన ప్రేమ్‌నగర్ చిత్రంలో కళ్యాణ్ పాత్ర ఆయన నట కిరీటంలో మరో మాణిక్యం. హిందీలో రాజేష్‌ఖన్నా ఈ పాత్రను మెప్పించడానికి ఎంత ప్రయత్నించినా, అక్కినేనితో సరితూగలేకపోయారని సినీ పాత్రికేయులు విశే్లషించారు. చదువు అబ్బని అక్కినేని కాళిదాసు పాత్రకు పనికిరాడని అప్పట్లో సినీ పండితులు విమర్శలు గుప్పించారు. ఈ చిత్రంతోనే పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు ఆయనతో మొదటిసారిగా పనిచేశారు. 1974లో అక్కినేని జీవిత స్వర్ణోత్సవం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంలో కామేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఆయన మాటల్లోనే ‘నాగేశ్వరరావు తపోమహిమాన్వితుడు కాబట్టి కాళిదాసుగా సాక్షాత్కరించి తన నట జీవిత మణిహారంలో కలికిపూసగా నిలిచేలా చేయగలిగాడు’ అన్నారు. 1954లో విడుదలైన విప్రనారాయణ చిత్రంలోని పాత్ర గురించీ విమర్శలు వెల్లువెత్తాయి. ఇది అక్కినేనికి మరో సవాల్ విసిరింది. ఇందులోని సంభాషణలు చాలావరకు సంస్కృతంలో ఉండటం, అక్కినేని చదువరి కాకపోవడం ఈ విమర్శలకు కారణం. విడుదల తరువాత ఈ చిత్రం గురించి భానుమతి మాట్లాడుతూ ‘అక్కినేని నట జీవితంలో ఇది ఒక మైలురాయి’ అంటూ కొనియాడారు. ప్రముఖ దర్శకుడు ప్రత్యగాత్మ చెప్పినట్టు అక్కినేని రాష్ట్రంలోను, దేశంలోనే కాక అమెరికా ఆహ్వానం పొంది అక్కడ కూడా తెలుగు దేశాన్ని, తెలుగుతనాన్ని సన్మానింపచేసుకున్న గొప్ప కళాకారుడు. తమిళ నట దిగ్గజం శివాజీగణేశన్, తెలుగులో మహానటిగా గుర్తింపు పొందిన సావిత్రి వంటి వారెందరో నటనలో అక్కినేని తమకు గురువని గర్వంగా చెప్పుకున్నారు. ఇంతేకాదు -అక్కినేని పాత్రల్లో నటించరు, జీవిస్తారు. అందుకే ఆయన అభిమానినయ్యానని 1974లో విజయచిత్ర సినిమా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ సింహళ భాషా నటుడు, దర్శకుడు, రచయిత, శబ్దగ్రాహకుడు గామినిఫోనె్సకా ప్రకటించారంటే, అక్కినేని ప్రభ ఎంతగా వెలిగిపోయిందో స్పష్టమవుతుంది. అక్కినేని తనకెంతో ప్రియమైన పాత్రగా చెప్పుకునే రవీంద్రుని పాత్ర 1961లో వచ్చిన బాటసారి చిత్రంలోనిది. విషాదాంతమైన ఈ చిత్రంలో ఆయన నటన అజరామరం. మొత్తం 74 ఏళ్ల నట జీవితంలో ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి మెప్పించారు. 1981లో వచ్చిన మరో విషాదభరిత చిత్రం ప్రేమాభిషేకం. ఇందులో రాజేష్ పాత్రలో భగ్నప్రేమికుడిగా అక్కినేని నటన మరొక్కసారి సంచలనం రేకెత్తించింది. బాలరాజు, పల్నాటియుద్ధం, కీలుగుర్రం, బ్రతుకుతెరువు, మిస్సమ్మ, రోజులుమారాయి, అర్థాంగి, తెనాలి రామకృష్ణ, ఇలవేలుపు, సువర్ణసుందరి, చెంచులక్ష్మి, జయభేరి, నమ్మినబంటు, పెళ్లికానుక, వెలుగునీడలు, ఆరాధన, పునర్జన్మ, మూగమనసులు, డాక్టర్ చక్రవర్తి, అమరశిల్పి జక్కన్న, నవరాత్రి, సుడిగుండాలు, అదృష్టవంతులు, దసరాబుల్లోడు, చాణక్య చంద్రగుప్త, మేఘసందేశం, సీతారామయ్యగారి మనవరాలు వంటి ఎన్నో చిత్రాలు ఆయనలోని అద్భుత నటనకు అద్దంపడతాయి. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో అక్కినేని నటించినన్ని విషాదభరిత చిత్రాలు మరే నటుడూ చేయలేదు. విషాద పాత్రలతో మెప్పించడంలో నాటికి, నేటికి, ఏనాటికీ అక్కినేనికి అక్కినేనే సాటి. మహోన్నత నటుడు మనమధ్య లేకున్నా, ఆయన నటించిన చిత్రాలు, వాటిలోని పాత్రలతో తరాలు మారినా, యుగాలు మారినా చిరంజీవిగా, ఎవర్‌గ్రీన్ హీరోగా శాశ్వతంగా నిలిచే ఉంటారు.

-గంజి కృష్ణ