Others

ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కఠినమైన శిలలు సైతం
గాలివాటానికో,
నది ఊతానికో చలిస్తుంటయ

మోడువారిన మ్రానులు సైతం
వరుణుడి ప్రభావానికో
ప్రకృతి స్వభావానికో చిగురిస్తుంటయ

జ్ఞానం లేని జంతువులు సైతం
కడుపు మంటకో
కన్నపేగుకో సంచరిస్తుంటయ

అండంలోని పిండం సైతం
జీవన గమనానికి
పెంకును పగులగొట్టి మరీ
ప్రపంచంలోకి అడుగులేస్తుంటయ

మేధస్సును పెంచిన మనిషి
ఎన్నో ఆవిష్కరణలు చేసి
నిర్జీవ యంత్ర పరికరాలకు
బందీయై బానిసవుతున్నడు

మనసున్న మనిషెందుకో
గోడకి కట్టిన పిడకలా
బ్యాటరీ డెడ్ అయన ఫోనులా
కుచించుకుపోతున్నడు
అన్యాయం, అవినీతి, అరాచకం
సంభవించినపుడు
మాటలొచ్చిన మనిషెందుకో
ప్రశ్నాస్త్రాలను సంధించకుండా
జడపదార్థంగా మిగిలిపోతున్నాడెందుకో??

- గంగాపురం శ్రీనివాస్, 967630595949