Others

చదివినోడికన్నా? (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు సమాజంలో కొందరికి అక్షరజ్ఞానం ఉండేది కాని ‘విజ్ఞానం’ ఉండేది కాదు. మరికొందరికి విద్యలేకపోయినా ‘విజ్ఞానం’, ‘తెలివిగా ఆలోచించడం’ఉండేది. ప్రతి ఇంటికి బట్టలు ఉతకడానికి ఒక మడేలన్న ఉండేవారు. వారు బట్టల లెక్కలు, రావలసిన నగదు నోటితోనే చెప్పగలిగేవారు. అందుకే అప్పుడు ‘చదివినాడికన్నా మడేలన్న మిన్న’ అని అందరూ అనేవారు. 1967లో ఎన్.టి.ఆర్. నిర్మించిన ఉమ్మడి కుటుంబం చిత్రంలో ఒక కుటుంబంలో ఆత్మీయంగా మెలుగుతూ కష్టకాలంలో వారిని ఆదుకున్న ఒక మడేలన్న అతని భార్య రేవులో బట్టలు ఉతుకుతూ పాటపాడుతూ సమాజానికి చెప్పిన మాటలు కొసరాజు తన కలంతో అక్షరబద్ధం చేసిన తీరు అభినందనీయం. ‘ఏటికి ఇద్దరి, అద్దరి ఒకటే/ కులాలు, మతాలు అన్నీ ఒకటే/ రేవున పెట్టి ఉతికేటప్పుడు ముతకా- సన్నం అన్ని ఒకటే’ అని చెప్పడం ద్వారా సమాజంలో కులాలు, మతాలతో భవిష్యత్తు పాడుచేసుకుంటున్న వారికి ఒక చెణుకు విసిరారు.
పారే ఏటికి ఆ ఒడ్డయినా, ఈ ఒడ్డయినా ఒకటే. అలాగే రేవున ఉతికేటప్పుడు బట్టలన్నీ సమానమే అయినట్లు రంగు, మతం, కులం, జాతి వేరయినా ‘మానవ సంక్షేమం’ దగ్గర అందరూ ఒక్కటే, సంఘజీవనంలో అందరూ ఒక్కటే అని చెప్పిన తీరు అభినందనీయం. ‘మంచి ఒక్కటే మారకుంటది/ మాట ఒక్కటే కలకాలముంటది/ పెట్టే ఇల్లు సల్లగుండమని మంచి మనసే తోడుగుంటది’ అంటూ సమాజంలో, కుటుంబంలో మన జీవనశైలి ఎలా ఉండాలో చెప్పడం మహత్తరం.
సమాజంలో అశాంతికి ఇచ్చిన మాట నిలబెట్టుకునేవారు, మంచితనం ఏ కాలంలో అయినా గౌరవించబడుతుందని, నలుగురికి సహాయపడేవారు కలకాలం క్షేమంగా ఉండాలని అందరూ కోరుకుంటారని చెప్పిన ఈ గీతానికి టివి రాజు స్వర రచనకు మాధవపెద్ది సత్యం, ఎల్.ఆర్.ఈశ్వరి హుషారైన గానానికి రాజబాబు, వాణిశ్రీ అభినయంతో పాటకు వనె్న పెంచి నేటికీ ఆలోచింపచేసేలా చేసిన చక్కటి గీతం.

-సుసర్ల సర్వేశ్వరశాస్ర్తీ, విశాఖపట్నం