Others

మరణపు కొస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరణాన్ని మోస్తున్న కళ్లు
తడబడినప్పుడు
గుండె తన స్థానాన్ని
మార్చుకున్న అలికిడి

ముందుకు తూలుతున్నది
దేహం మాత్రమే కాదు
భవిష్యత్తుతో పాటు
కొన్ని జతల కలలు కూడాను

మించిన దానికంటే
ముందుకు సాగడమంటే
చీకటి మట్టిని నెత్తిపై పోసుకోవడమే

పాదాలను
భూమిలో తడుపుకోవాలి గాని..
తలను పాతేసుకుంటే
చూపు ఎలా కనపడుతుంది?

కాలిపై కాలేసుకోవడం
హుందాగానే ఉంటుంది...
మర్చిపోకు
నువ్వున్నది మరణశయ్యపై
బహుశ నిమిషపు దూరంలో...

చాలాసేపటి నుండి
నా కాళ్లకు ఏదో గుచ్చుకుంటోంది
తడిమి చూసాను
మనిషి పారేసుకున్న ముందుచూపులు
ఆక్సిడెంట్ జోన్‌లో
అదుపు చేయడం కాదు
అదుపులో ఉండాలి
అప్పుడే
తూర్పు మొగ్గ విడగడం చూడగలవు...

- అఖిలాశ, 7259511956