Others

చీకటి వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితమంటేనే
శబ్ద నిశ్శబ్దాలమయం
జననం నుండి మరణం దాకా...
చీకటి వెలుగుల మధ్య
జరిపే ప్రయాణం!

చీకితోనే కదా...
వెలుగుకు అస్తిత్వం!
నిశ్శబ్దాన్ని ఆశ్రయస్తే కదా...
శబ్దాన్ని ఆస్వాదించగలం!

రాత్రి తర్వాత
పగలు వచ్చినట్లు
కష్టాల కడలి దాటాక
ఇక చేరేది
సుఖాల తీరమే!

నేటి అనుభవమే
రేపటికి
మూలధనం...
కాలగమనంలో కొన్ని క్షణాలు
మనల్ని నిరాశపరిచినా...
అవే...
రేపటి ఆశలకు
తొడుగుతాయ చిగురులు!

అలాగే
శశిని కమ్మిన చీకటి
శాశ్వతం కానట్లు...
మనల్ని కలతపెట్టే
వెతలు తాత్కాలికమే కానీ...
ఉండవు కలకాలం!

- దాస్యం సేనాధిపతి, 9440525544