Others

ఎటమటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బువ్వ తినకుంట అలిగిన కొడుకులున
బెదిరిస్తావా, చేరదీస్తవానే బాపు

కష్టమో నిష్టూరమో కడుపునొప్పోని తోని
మాట్లాడతావా, కొట్లాడుతావా సారు

కడుపు సగం ఎండి ఏడుస్తాంటే
ఎసరు పెడతావా, ఎస్లనే పల్గోడుతవానే నాయన

కలుపుకునుడా, అట్లనే ఏకేరే ఉంచుడా
ఎనుకటి మాటలు సుతులాయంచుకోవాలె గని
సంగ సంగ ఎగురుడు ఎందుకే అన్నయ

ముండ్లు కుచ్చితే పండ్లతోని పీకుతనంటివి
గడ్డమీన కూకున్నంక పట్టుకారన్న పట్టవైతివి

పయ్యలు అసలే కదలద్దు
సకల జనుల తడాక సూపియ్యలె
అప్పటి మాటలు యాదికి రావట్టే గదనే పెద్దన్న

సమ్మె అంటే సమ్మెట పట్టవడ్తివి
సంగం గింగం సంగతి సూస్తనంటన్నవ్
ఎట్లనే పెద్దనాయన గిట్ల అయతే

కూకుండ వెట్టి నలుగుట్ల మెప్పియ్య
గిది గుర్రం గది మైదానం, తెల్లగోలు చెయ్య
మేసేటివి మేస్తయ,
తెంపుకునేటివి తెంపుకుంటయ

బండి ఎటమటం నడుస్తున్నట్టున్నది పెద్దబాపు
కొత్తంగా అమ్రిచ్చుకున్నం గదా,
పైలం దొర్రగిల పడగాల.

- అన్నవరం దేవేందర్, 9440763479