Others
వస్తు గుణమే కవిత్వానికి ముఖ్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సంగీత - సాహిత్య సంచారిణి
సుహృల్లేఖ -4
*
దులో ఒక అద్భుతమైన తెలివివున్నది. తాను చెప్పిన ఒక విషయాన్ని పాఠకుని హృదయ ఫలకంమీద ముద్రవేయగలగడమే గాక మరల గుర్తుకు రాకుండా వారిని మళ్ళించగలడు. అది చాకచాక్యం కావచ్చు లేదా లౌక్యం కావచ్చు. ఏది ఏమైనా ఆధునిక కవితా ప్రపంచంలో పదిసార్లు చెరిపినా చెరగని వ్యక్తి శ్రీశ్రీ. కవిత్వ ప్రయోజనమైన ఆనందమును మార్క్సిస్టు దృక్పథంతో కూడా నిర్వచించవచ్చునన్న ఆయన అవి దాటవేసి ‘ఇంగ్లండులో వచ్చిన పారిశ్రామిక విప్లవానంతరం అభివృద్ధిలోనికి వచ్చిన మార్క్సిస్టు భౌతిక తత్వజ్ఞానం ఒక ముఖ్య విషయాన్ని స్పష్టం చేసింది.. దీనితో అనేక దేశాల్లో అనేకుల జీవితాల్లో తిరుగుబాటు వచ్చింది. సామాజిక జీవితాన్ని సుఖమయమూ, శుభకరమూ చేయాలని, భూతలాన్ని ‘స్వర్గం’గా మార్చాలని, వ్యక్తి సమాజానికి, సమాజం వ్యక్తికి పరస్పరం ప్రయోజనకారిగా ఉండేటట్లు చేస్తుందని వ్రాస్తూ (కవిత్వానికి) ‘ఆత్మానందం’ పరమావధి అనే దృష్టి సంకుచితంగా, నిరోధకంగా కనిపించకపోదు అని అంటాడు. చివరగా శాసనాల కంటె బలమైనది, ఉదాత్తమైనది, ఉల్లంఘించరానిది కవి వాక్యము’ అంటాడు (అభ్యుదయ మాస పత్రిక 1946). ప్రేమ, ద్వేషము, కోపము, భక్తి, సంతోషము, హాసము మొదలైన భావాలన్నింటికీ సంగమ స్థానము రసము. అదే రసానందము. రసము వ్యక్తి నిష్ఠము. తద్వారా సామాజిక నిష్ఠము. కవి, రసము లేనిదే కావ్యము లేదు. కావ్య ప్రయోజనములో ముఖ్యమైనది విశ్వశ్రేయస్సు. ప్రపంచములో కొన్ని యిష్టమైనవి, కొన్ని శ్రేష్ఠములయిన విషయాలుంటాయి. ఇష్టమైనవి ప్రేయములు. శ్రేష్ఠమయినవి శ్రేయములు. కవి చెప్పేది శ్రేయోదాయకంగా ఉండాలి. అదే విశ్వ శ్రేయస్సు. దీనిలోనే ఆనందము, ఉపదేశము ఇమిడిపోతాయి. ఆనందమును త్రోసివేస్తే కవి ఎట్లా వ్రాస్తాడు? పాఠకుడెందుకు చదువుతాడు? కేవలం విషయాలకోసమైతే చరిత్ర చదువుకొనవచ్చును. శాసనాలు దగ్గర పెట్టుకుని చారిత్రక కథలు వ్రాసుకోవచ్చును. కవి ముందుగా తనకు కలిగిన అనుభూతితో తన్మయుడు కావాలి (అనుభూతి హృన్నిష్ఠము). ఆనంద పరవశుడు కావాలి. కవి తానానందించకపోతే పాఠకుని ఆనందింపజేయలేడు.
ఈ లేఖల ఉద్దేశ్యం కవిత్వాభిరుచి గలిగినవారికి ఉత్సుకత కల్గించడమే. అక్కిరాజు ఉమాకాంతంగారు నాటి కవులను, కావ్యాలను దూసి పోశారు. కొత్త కొత్త వస్తువులుంటాయి. కొత్తరకం అభివ్యక్తి ఉంటుంది. అది విశ్వశ్రేయస్సు లేదా సామాజికాభ్యుదయ విషయంలో విలీనం కావలసిందే. ఇది ఏదో సిద్ధాంతానికి వ్యతిరేకమని కవిత్వాన్ని నిరసించడం మంచిది కాదు. షేక్స్పియర్ వ్రాసిన నాటకాలు దాదాపు అన్ని రాజులను గురించినవే. ‘షానామా’ గూడా అంతే. మార్క్సిజం అనండి, మరి ఏ యిజం అనండి- అది నిజం వైపు బాట వేసేదై ఉండాలి. అందుకే మార్క్సిజం ఎప్పుడూ మారుతూ వుంటుందని ఇప్పుడంటున్నారు మార్క్సిస్టులు.
టాల్‌స్టాయ్ ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన కవి అని అందరికీ తెలుసు. లెనిన్ అంటాడు ‘టాల్‌స్టాయ్ భావాలు మన రైతు తిరుగుబాటు యొక్క లోపాలకు, బలహీనతకు దర్పణం’. పితృస్వామిక గ్రామీణుల దౌర్బల్యానికి ‘సొంత బుద్ధిగల రైతు’ యొక్క కరుడుగట్టిన పిరికితనానికి ప్రతిబింబము (వి.ఐ.లెనిన్- సాహిత్యంమీద వ్యాసాలు 11 సెప్టెంబర్ 1908) ఆయన సోషల్ డెమొక్రాటిక్ పార్టీ చట్రంలో ఇమడలేదు కనుక ఈ నిరసన భావం! లెనిన్ ఇంకా అంటాడు ‘సాహిత్యం కార్మిక వర్గ సమష్టిహితంలో భాగం కావాలి.. ఏకైక సోషల్ డెమొక్రాటిక్ మహా యంత్రాంగంలో ‘ఒక చక్రము, ఒక మర’ కావాలి. (అదే పుస్తకం).
ఈ అభిప్రాయం అప్పటిదాకా దేశం దృష్ట్యా, పార్టీ దృష్ట్యా సమర్థనీయం కావచ్చు కాని కావ్యమనేది సార్వకాలికతను, సార్వజనీనతను, సౌందర్యమును సంతరించుకొని ఫలానా కావ్యం బాగున్నదనడానికి ఇవే ముఖ్యమైన కొలబద్దలు. ఏ సాహిత్యమైనా ఆ పార్టీ సిద్ధాంతాలకు లోబడనంత మాత్రాన అది సత్ సాహిత్యం కాకపోదు. గిరిగీసుకుని సాహిత్యమంటే ఇట్లా ఉండాలి అనడం సంకుచితం కాకపోదు. సమాజాన్ని, సమాజ తత్వమును ప్రతిబింబింపజేయనిది కావ్యాదర్శము కాదు. ఛందశ్శాస్త్రాలు, అలంకార శాస్త్రాలు, కావ్య లక్షణ గ్రంథాలు కావ్యాన్ని విశే్లషించడానికి పనికొస్తాయేగాని కావ్య వస్తువును నిర్దేశించవు. అది కవి యొక్క అపార జీవన వ్యాపారానుభవాలమీద ఆధారపడి వుంటుంది. ఫలానా వస్తువును గురించి కవిత్వం రాయి అనటానికి ఎవ్వరికీ అధికారం లేదు. మన కవులు నిరంకుశులు, నిష్పాక్షికులు, సత్యానే్వషకులు. ఛందోలక్షణాలు, శాస్త్రాలు లేకపోయినా కవిత్వమున్నది. వానికావల కవిత్వముంటుంది. ఏ గుణం లేకపోతే ఆ వస్తువునకునికి లేదో - ఆ గుణం ప్రాణం. అది కవికి తెలుసు. ‘లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగిన తుది- అలోకంబగు పెంజీకటికవ్వల.. ఏకాకృతి- వెలుగు’ అన్నట్లు అదే కవిత్వం. కవిత్వ గుణం లేకపోతే ఈ శాస్త్రాలు, సిద్ధాంతాలు, లక్షణ గ్రంథాలు, అలంకారాలు నిర్వీర్యములు. నిస్తేజములు. కవి తాత్వికుడు కాదు. తాత్విక చింతన భూమికగా కలవాడు. సౌందర్యోపాసకుడు. సమాజంలో తానొకడు. అంతరావలోకనం కలవాడు. క్రమంగా ఆధునిక కవిత్వంలో అంతస్తత్వమును గూర్చి తెలుసుకొందాం.