Others

కొలకలూరి భాగీరథీ కథానికా పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమతి కొలకలూరి భాగీరథీ పురస్కారం ప్రారంభించాక ఇది పదమూడో సంవత్సరం. ఇంతవరకు కథానికకు (2008, 2011, 2014, 2017), కవిత్వానికి (2009, 2012, 2015, 2018), విమర్శనానికి (2010, 2013, 2016, 2019) పురస్కారాలు ప్రదానం చేశాము. ఈ సంవత్సరం ముద్రిత కథానికా సంపుటికి పురస్కారం ప్రదానం చేయడం జరుగుతుంది. కడచిన మూడు సంవత్సరాలలో అంటే జనవరి 2017 నుంచి డిసెంబర్ 2019 వరకు ముద్రితమైన కథానికా సంపుటి (ఒక్క రచయిత గ్రంథమే) ఈ పురస్కారానికి పరిశీలించబడుతుంది. పురస్కారం రచయితకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇందుకోసం రచయితలుగానీ, ప్రచురణకర్తలు గానీ మూడేసి ప్రతులు పరిశీలనార్థం పంపగోరుతున్నాము. ఒకే రచయితవి ఒకటి కంటే ఎక్కువ గ్రంథాలనైనా పంపవచ్చు. పురస్కారంగా రూ.15వేల నగదు, శాలువ, మెమొంటో ప్రదానం చేస్తాం. కథానికా సంపుటులు 12-1-2020లోగా పంపగోరుతున్నాము. 12-2-2020లోగా పురస్కార ప్రకటన జరుగుతుంది. 26-2-2020న హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాయలంలో జరిగే సభలో పురస్కారం ప్రదానం చేస్తాం. కథానికా సంపుటులు పంపవలసిన చిరునామా-
ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, ఆంధ్రాచార్యులు, తెలుగు శాఖ,
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం,
తిరుపతి -517 502, ఆం.ప్ర.