Others

కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమతి కొలకలూరి విశ్రాంతమ్మ పురస్కారం ప్రారంభించాక ఇది పదమూడో సంవత్సరం. ఇంతవరకు నవలకు (2008, 2011, 2014, 2017), నాటకానికి (2009, 2012, 2015, 2018), పరిశోధనకు (2010, 2013, 2016, 2019) ఈ పురస్కారం ప్రదానం చేశాము.
ఈ సంవత్సరం గ్రంథ రూపంలో ముద్రిత నవలకు పురస్కారం ప్రదానం చేయడం జరుగుతుంది. గడచిన మూడు సంవత్సరాలలో అంటే 2017 నుంచి డిసెంబర్ 2019 వరకు ముద్రితమైన తెలుగు నవల పురస్కారానికి పరిశీలింపబడుతుంది. ఇందుకోసం రచయితలుగానీ, ప్రచురణకర్తలుగానీ మూడేసి ప్రతులు పరిశీలనార్థం పంపగోరుతున్నాము. ఒకే రచయితవి ఒకటికంటే ఎక్కువ నవలలు ఎన్నయినా పంపవచ్చు. పురస్కారంగా 15వేల నగదు, శాలువ, మెమొంటో ప్రదానం చేస్తాం.
నవలలు 12-1-2020లోగా పంపగోరుతున్నాము. 12-2-2020లోగా పురస్కార ప్రకటన జరుగుతుంది. 26-2-2020న హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే సభలో పురస్కారం ప్రదానం చేస్తాం. ముద్రిత నవలలు పంపవలసిన చిరునామా-
డా కొలకలూరి సుమకిరణ్, ప్రొఫెసర్, ఆంగ్ల శాఖ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం,
తిరుపతి-517 502, ఆం.ప్ర.