Others

కవిత్వమెందుకు వ్రాయాలి? కావ్యమెందుకు చదవాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగీత - సాహిత్య సంచారిణి
*సుహృల్లేఖ -5
**
ఆధునిక కవిత్వాన్ని పరామర్శించే ముందు మరొకసారి కళా ప్రయోజన పునర్విమర్శ అవసరమనుకొంటాను. సర్వకళల సమాహార రూపం సారస్వతం. అందునా కవిత్వం శీర్షస్థానంలో వున్నది. సాహిత్యమన్నా, ఒక్కొక్కసారి సారస్వతమన్నా, ఇక్కడ కవిత్వమనే మిత్రులు గ్రహించాలి. రాను రాను మన పండితులు విమర్శకమ్మన్యులు ఆనందం, రసానందం అనే మాటలు కేవలం బ్రాహ్మణ వాదానికి చెందినవనేటంత వరకు వచ్చారు. ఇదీ మన పురోగమనం! పోనీండి, అటువంటివారిని గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంతగా మనకు శక్తి, సమయము వృధాగాకుండా ఉంటాయి. మన కవులు, తాత్వికులు, పండితులు శబ్దాన్ని బ్రహ్మముగా ఉపాసించినవారు. శబ్దానికి అర్థం అవ్యవధానంగా ఉంటుంది. విపులంగా తరువాత చూద్దాం.
ఉన్నది ఒకటే. అది ఆనందం, ప్రపంచంలో వున్న రాక్షస గుణగణమ ధర్మానికి కారణం. ఆ అధర్మం కవికి పరితాప హేతువు. అధర్మాన్ని కవి సహించలేడు. ఆపాదమస్తకం కంపించిపోతాడు. మనస్సు కుతకుతలాడుతుంది. ఒకటే వేదన! ఆ వేదనాగ్ని కవిని మానసికంగా దహించివేస్తుంది. శోకం పెల్లుబుకుతుంది. కోపం కట్టలు తెగుతుంది. ‘అధర్మో యమితి’ అంటాడు. అపుడాశ్చర్యం కలుగుతుంది. ధర్మధ్వజావిష్కరణ జరుగుతుంది. ఆనందం అవగతమవుతుంది. చివరికి చిరస్థాయిగా మిగిలేది స్థారుూభావం. అదే రసం. ‘రసము వేయి రెట్లు గొప్పది..’ అన్నారు విశ్వనాథ. ‘రసేనైన జీవతి కావ్యం’ అన్న వాక్యానికింత తతంగం వున్నది వెనుక. ఆధునిక కవి పండితులు శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మగారు మరొక అడుగు ముందుకు వెళ్లి ‘కరుణంలో నుంచే కవికి అనుభూతి వస్తుంది’ (కవిసేన మ్యానిఫెస్టో) అన్నారు. రసానికీ ఆనందానికీ అభేదం. ‘బీజ స్థానీయో కవిగతో రసః (కవిర్హి సామాజిక తుల్య యేవ) తతః వృక్షస్థానీయః కావ్యమ్.. తత్ర ఫలస్థానీయస్సామాజిక రసాస్వాదః’ అని అభినవగుప్తుడు. ఈ మాటను ఆధారం చేసుకొనే శేషేంద్ర శర్మగారు ‘అసలు ఆనందమే కావ్యం. ఆనందం కల్గించనిది కావ్యమే కాదు’ అన్నారు. ఆనందానికి ప్రాక్పశ్చిమ సాహితీ లాక్షణికులెంతటి ప్రముఖ స్థానమిచ్చినారో చూడండి. అనుభూతి నుండి ఆనందానికి ప్రయాణించే త్రోవలో, అంటే కవి హృదయంలో జరిగే అల్లకల్లోలాన్ని ‘హృదయ సంవాదం’ అన్నాడు భరతుడు. అలంకారికులకు మూల పురుషుడా భరతుడే. నాట్యమంటే ఉత్తమ కావ్యమే. ‘నాటకాంతం సాహిత్యమ్మ’ని కదా! హృదయ సంవాదాన్ని ప్రీతి అన్నారు తరువాత వచ్చిన అలంకారికులు.
‘కరోతికీర్తిం ప్రీతించ సాధు కావ్య నిషేవణం’
(్భమహుడు)
‘కావ్యం సత్.. ప్రీతి కీర్తి హేతుత్వాత్’ (వామనుడు)
‘ప్రీత్యాత్మాచ రసః’ (తౌతభట్టు)
‘కీర్తిం ప్రీతించ విందతి’ (్భజుడు)
‘సత్యః పరనిర్వృతయే’ (దండి)
‘బ్రహ్మాస్వాద సదృశీ ప్రీతిరానందః’
(హేమచంద్రుడు) ‘సద్యః పరనిర్వృతి’ అంటే ఆనందం. ఆనందానికి అనుభూతి, అనుభూతికి సత్త్వభావము మూలకములు. సత్త్వమునుంచి రసముద్భవిస్తుందని భరతుడు. కవిత్వమే కాదు ఏ కళయైనా అనుభవనీయమే. అంతే. ఒకసారి శ్రీశ్రీగారు, మరికొందరు మాన్యులు ప్రాతఃస్మరణీయులు నైన చెళ్ళపిళ్ల వారి నడిగారట, ‘కవిత్వమంటే ఏది?’ అని. ‘ఏది కవిత్వము కాదో మీరు చెప్పండి. అప్పుడేది కవిత్వమో’ నేను చెప్తానన్నారట. లోతుగా ఆలోచిస్తే కవిత్వం కానిది నిలువదని నాకనిపిస్తుంది. అట్లాగే what is poetry? అనే దానికి St.Augustine అంటాఢు. If not asked, I know. If you ask me, I know not అని (మీరడక్కపోతే నాకు తెలుసు. మీరడిగితే నాకు తెలియదు) అంటే కవిత్వాన్ని మామూలు మాటలలో నిర్వచించలేమనే కదా! ఇంకా ఆంగ్ల కవిత్వంలో లబ్ద ప్రతిష్ఠులన్నమాటలు చూడండి.
"It is the art uniting pleasure with truth by calling imagination to the help of reason'' (Thomson)
"Poetry is the antithesis of Science having for its immediate object pleasure, not truth'' (Coleridge)
"It is simply the most delightful and perfect form of utterance that human words can reach''(Mathew Arnold)
... the art of producing pleasure by the just expression, imagination, thought and feeling in metrical languages'' (Prof. Conthope)
"The purpose of the poem is to teach and delight'' (An English Writer) Preasure అంటే Feeling of satisfaction of joy అనీ, delightఅంటే great pleasure) అనీ కధా!
ఇన్ని నిర్వచనాలను, ఉద్దేశాలను ఉటంకించటం- నాకు తెలుసుననీ కాదు, మరొకరికి తెలియదనీ కాదు.
‘ఉత్తమాధమ మాధ్యానామ్ / నరాణాం కర్మ సంశ్రయమ్ / హితోపదేశ జననం / ధృతి క్రీడా సుఖాదికృత్ / హితం బుద్ధి వివర్థనమ్ / లోకోపదేశ జననం- నాట్యమే తద్భవిష్యతి’ అని భరతముని అంటాడు.
కవిత్వం లేదా కళ యొక్క ప్రయోజనం- ‘లోకహితోపదేశం, ప్రీతి లేక ఆనందం, విశ్వశ్రేయస్సు’- అని స్పష్టమవుతున్నది. కవిత్వమెందుకు వ్రాయాలి? కావ్యమెందుకు చదవాలి! అన్నదానికిది వివరణం.

- ముళ్ళపూడి సచ్చిదానందమూర్తి