Others

కాలం విసిరిన గాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండెల్లో గూడల్లుకుపోతున్న
స్వార్థ సంకుచిత భావగణాలు
వేళ్లూనుకుపోతూ విస్తరిస్తున్నాయి
మానవత్వాన్నీ వెక్కిరిస్తూ
అరంగుళం జాగాకోసం సలిపే
అవిశ్రాంత అంతర్యుద్ధాలు!
పగలూ ప్రతీకారాలూ
ఆరని అగ్ని జ్వాలలై
మన్ఫఃలకాలను పగులగొట్టేస్తున్నాయి!
విచక్షణా జ్ఞాన శూన్యతకు
పరాకాష్ఠగా నిలుస్తున్న ప్రబుద్ధులు
అంతటాతారసపడుతున్న నేపథ్యంతలో
చీకటికోణాలు చుట్టి పారేస్తున్న వైనంలో
కళ్లు తెరవాలంటేనే భయం
వెలుగులో ఏముందన్న ప్రశ్న
వింతైన విషపు నవ్వులూ
మభ్యపెట్టే మాయమాటలూ
అసూయాద్వేషాలు,ద్రోహచింతనమూ
ఒకటేమిటి? ఎన్నో.. ఎనె్నన్నో...?
కాలం విసిరిన గాలం అలాంటిది మరి

కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం 9492457262