Others

హృదయాన్ని తాకేదే కవిత్వం ( సుహృల్లేఖ -6)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వమంటే ఏమిటో, కావ్య ప్రయోజనమేమిటో దిఙ్మాత్రంగా తెలిసికొన్నాం. ఎన్ని శాస్త్రాలు, లక్షణ గ్రంథాలు చదివినా అవి కార్యరసాస్వాదనకు కొంతవరకుపకరించవచ్చు. వాని ప్రయోజనమంతే.
ప్రతివాడు కవి కాలేడు. దానికి తపస్సు అంటే ఏకాగ్రత అవసరం. దానినే రుద్రటుడు ‘సమాధి’ అన్నాడు. ఆ స్థితిలో కవిత్వం వ్రాస్తాడు. ఏదో ఒక అంతస్త్వముంటుంది. కవి తనకు కలిగిన అనుభూతి వలన బాహ్యప్రపంచమును మరచిపోయి, అంతర్లోకాలలో విహరించి ఒక విలక్షణార్థాన్ని మోసికొని వచ్చే మామూలు శబ్దాలతో తిరిగి మన లోకంలోనికి వస్తాడు. కవి స్వయంభువని చెప్పనక్కరలేదు గానీ మనిషి, ‘‘మనీషా = మనుతే మనీషా’’- మన అవబోధనే; అన్నింటిని తెలిసికొనునది. ‘‘మనస, ఈషావత్- లాంగల దండవత్ సంబంధాద్వా ‘మనీషా’- అని గురుబాల ప్రబోధిక. స్థూలంగా ప్రతిభావంతుడని చెప్పుకోవచ్చు. మంచి వ్యుత్పన్నుడై, సాధకుడై ఉండాలి. అప్పుడు తప్తకాంచనం వలె మెరుస్తాడు కవి. ఇప్పుడతాని మాటలలో ఒక నియమితగతి ఉంటుంది. నిజముంటుంది. చిత్రమైన రూపం ధరిస్తుంది. అందముంటుంది. ఆకర్షణ ఉన్నది. అంతర్లయ ఉన్నది. కదలిక ఉన్నది. నీతి ఉన్నది. నిజాయితీ వున్నది. ఏదో సంగీతం వినిపిస్తుంది. బాహ్య ప్రపంచంలో దొరకనిదాతని మాటలలో ప్రత్యక్షవౌతుంది. అవన్నీ మామూలు మాటలే. ఒక వినూత్న విలక్షణార్థాన్ని చెప్పి అవి మాయవౌతాయి. ఆ అర్థానికి బద్ధుడైన కవి లేదా కళాకారుడు సామాజికుని, శ్రోతను బంధిస్తాడు. ఇదొక గారడి. ఈ ఇంద్రజాలమంతా ఎట్లా జరుగుతోంది? హడ్సన్ అంటాడు ‘మానసిక తత్వశాస్తవ్రేత్తలను సంప్రదించవలసిందే’నని.
కవిత్వంలో రెండు అంశాలుంటాయి. 1. వస్తువు 2.రూపము లేదా విషయము, విధానము. కంటెంట్ అండ్ ఫామ్ ఏది ప్రధానము? అన్నపుడు రెండునూ అని చెప్పాలి. రెండింటినీ విడదీయలేము. సమపాళ్ళలోనే ఉండాలి అని శ్రీశ్రీ. విధానమే ముఖ్యమని శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మగారు టెక్నిక్ లేని కవిత్వాన్ని నేనూహించలేను అంటారు సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రకర్త శ్రీ ఆరుద్ర. (త్వమేవాహం- చివర అనుబంధంగా ముద్రించబడిన శ్రీ దాశరథికి వ్రాసిన లేఖ) ఇక్కడే టి.ఎస్.ఇలియట్ మాటలను ఉటంకిస్తాను. -్యళఆక జఒ శ్యూ ఘౄజూళ ఇక జజూళ్ఘఒ ఇఖఆ జశశళూ ఒ్యఖశజూ చిళళజశఒ. -్యళఆక జఒ శ్యఆ ౄళ్ఘశ, ఇఖఆ ఇళ’’ అధి పారవశ్యస్థితి. ఫీలింగ్ ముఖ్యం. కావ్యతత్త్వవేత్త ష్దశ్యజూ ‘ళళరీజఒ్ద ఆ్దళ షూజౄళ ఘ్ఘజశఒఆ జఛిళ, ఆ్దళ త్యీఒఆ యచి షూజౄళఒ జఒ శ్యఆ ఆ్య చిళళ..’’ అని అంటాడు. వాహిక కవి స్పందించిన తీరునకేర్పడిన తెన్ను. ఈ తెన్ను ఛందస్సునకు సంబంధించినది. ‘మానిషాద..’ శ్లోకం అట్లా వచ్చిందే. ‘పాదబద్దోక్షర సమస్తంత్రీ లయ సమన్వితః’ అని కదా.
కవిత్వమందరికీ రా నట్టే అందరికీ అర్థం కాదు. కవికి మరొక కవి చక్కని శ్రోత. సహృదయుడు శ్రోత. భవభూతి ‘సమాన ధర్ముడ’న్నాడు. ఈనాటి పాఠకులు కవిత్వాలను చదవటంలేదు. పాఠకులకెటువంటి కవిత్వం కావాలో కవి కూడా ఆలోచించాలి అని శ్రీ చందు సుబ్బారావుగారు వ్రాశారు. (1994 అక్టోబర్ 17 ఆంధ్రప్రభ దినపత్రిక). కవిది దుకాణం కాదు. ఎవరికెంత ఎట్లాంటి సరుకు కావాలో వారి వారికి చూచి తూచి రుూయడానికి. కవిత్వమెప్పుడైనా కొద్దిమంది మాత్రమే చదువుతారు. వారు సమాజాన్ని ప్రభావితం చేస్తారు. కాగా కవిత్వం గాని, మరే కళ గాని ఏ రాజకీయ సాంఘిక ఆర్థిక సమస్యకు తక్షణ పరిష్కారం కాదు. ఇచ్ఛ, ప్రయత్నం, జ్ఞానం, సుఖం, దుఃఖం, ద్వేషం- ఈ ఆరు జీవ లక్షణాలు. ఈ గుణం భూమికగా కవిత్వం సాగుతుంది. కవిత్వం మడతలు, మడతలుగా పొరలుగా వుంటుంది. లోతు చూడ్డానికంత ఓపిక లేదు. ఎవరికీ తీరిక లేదు. ఉత్తమ కవిత్వం వస్తూనే వున్నది. మనకిది లాభమా? అని ప్రశ్నించుకునే పాఠకునికి కవిత్వమెందుకు? ఇక విమర్శకులు - విమర్శ వ్రాసేటప్పుడు విచిత్రంగా ఆ క్షణంలో ‘గుణైక పక్షపాతులు’గా మారిపోతారు. లేని గుణాన్ని కూడా ఆపాదించి ఆమోదింపజేయగల ఉదార హృదయులును ఉన్నారు. ఇక పోనీండి- కవికి అభివ్యక్తి కావ్యం. కావ్య రసాస్వాదనలో కవి కావాలని ఏవిధంగాను శ్రోతకు కష్టం కలిగించరాదు. మార్గం సుగమం చేయాలి. అది రమణీయంగా ఉండాలి. పాఠకుడందుకొనగలిగేటంత దూరంలోనే ఉండాలి. కావ్యమెట్లా ఉండాలో వాల్మీకి సందర్భనుసారంగా చాలాచోట్ల చెపుతాడు. ‘రహస్యంచ ప్రకాశంచ యద్వృత్తం తస్యధీమతః ‘ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవదృశ్యతే’. స్పష్టత (అసందిగ్ధం) సంక్లుప్తి ( అవిస్తరం). కవి అనుభవించినట్లు సాక్ష్యముండాలి (అవికంపితం) (అనుభూతి). అస్పష్టతే కవిత్వ లక్షణంగా చెప్పేవారు కూడా ఉన్నారు. సంప్రదాయముండాలి. సంప్రదాయంలోనే మన జీవన విధానము, విశ్వాసాలు ఇమిడి ఉంటాయి. సంప్రదాయ కవిత్వమంటే పద్య కవిత్వమని చెప్పేటంతటి దూరం వెళ్ళాము మనమీనాడు. పద్యానికి, గద్యానికి స్వరూపంలోనే కాదు, స్వభావంలోనూ చాలా తేడా ఉన్నది. దేని పరమార్థం దానిది. కవిత్వంలో శబ్ద దృష్టి, సౌందర్యార్థము ముఖ్యం కాగా, కవిత్వం కాని గద్యంలో అవగాహన మాత్రమే ముఖ్యం. ఛందోబద్ధమైనంత మాత్రాన కవిత్వమవుతుందని ఎవరన్నారు?
కాళిదాసు మేఘదూతం ఒకేరకం వృత్తం మందాక్రాంతలో వున్నది. తెలుగులో చాలా శతకాలు కంద పద్యాలలో వున్నాయి. నరసింహ శతకం, శ్రీకాకుళాంధ్ర దేవశతకాలు సీస పద్యాలలో వున్నాయి. వాటిని ఆధునికులు సామాజిక జీవనానికి దర్పణాలని కూడా అంటున్నారు. తిక్కన స్ర్తి పర్వంలో అనేక రకాల వృత్తాలను వాడారు. శ్రీ విశ్వనాథ శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో ఛందశ్శిల్పమంటే ఏమిటో చూపించారు. గురజాడ అప్పారావు గారు ముత్యాలసరాలనెన్నుకున్నారు. డా.సి. నారాయణరెడ్డిగారు మొత్తానికి మాద్రాఛందస్సులోనే వ్రాశారు. డా. గుంటూరు శేషేంద్ర శర్మగారు ఆయన పద్యాలని అంటున్నా అవి పరిచ్ఛేదాలుగా ఉంటాయి. ఏ ఒకటి మరొకదానివలె ఉండదు. కాని అన్నింటిలో ఒకే రకమైన భావ ప్రవాహ గతి ఉంటుంది. కనుక అక్కడ ఏ ఛందస్సు వున్నది, ఏ వృత్తంలో చెప్తున్నాడని ప్రశ్నకాదు. రాముడు సాక్షాత్తు దేవుడని చెప్పడానికి మహర్షి సీత నోట అనిపిస్తాడు.
‘‘్ధన్యా దేవా స్సంగంధర్వా స్సిద్దాశ్చ పరమర్షయః
మమ పశ్యంతి యేనాథం రామం రాజీవ లోచనం’’
(నా నాథుని రాముని రాజీవలోచనమని ఎవరు చూస్తున్నారో, ఆ దేవతలు, గంధర్వులు, సిద్ధులు మహర్షులు ధన్యులు) అని- రాముడు అయోధ్యలో పుట్టాడు. అడవిలో తిరిగాడు. కిష్కింధలో వున్నాడు. మరి స్వర్గలోకంలో వుండే వారెట్లా చూస్తున్నారు? ఆయన స్వర్గలోకానికి రాకపోకలు సాగించిన వైనమేమీ లేదే? కనుక ఆయన దైవమనే మాట చెప్పకుండానే చెప్పడం కదా ఇది! ఎంత హృద్యమైన పద్ధతి. ఇక్కడ ఛందస్సు తీసివేస్తే ఏమి? కొంచెం సంగీతం దెబ్బతింటుందేమో! రమణీయార్థాన్ని ఊహించడంలోనే సంగీతమున్నది. ఊహ కూడా లయాన్వితమే. అట్లాగే సీత అందంగా ఉన్నదనడానికి రాముడు-
విచిత్రమేమంటే రాముని దుఃఖం తెలుస్తూనే లోతునకు వెళ్లినకొలది- సీత అందం, హనుమంతుని వాఙ్మయం తెలుస్తాయి. ఇంకా, తిరుగుబాటు వస్తోందనడానికి శ్రీశ్రీ ‘అవతారం’ చూడండి మహాప్రస్థానంలో. విశ్వనాథవారి వరలక్ష్మీ త్రిశతిలో అస్థినిమజ్జన ఘట్టం విని కంటనీరు పెట్టని శ్రోత ఉండడు.
ఇది పద్య కవిత్వమా? వచన కవిత్వమా? గేయమా? అని తర్కించడం పని లేని పని. కవి చెప్పుచున్నది హృదయానికి తాకుతోందా? అనేది ముఖ్యం. కవిత్వమజరామరం. కవిత్వానికి కాలం చెల్లిందనడం- కవిని, కాలాన్ని అర్థం చేసికొనలేకపోవడమే. సాహితీ మిత్రులకివే నమస్సులు. ఈ లేఖలు కేవలం సూచనలు.
- సమాప్తం -

- ముళ్ళపూడి సచ్చిదానందమూర్తి