Others

ది వేస్ట్ లాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏరువాకొచ్చి ఎనే్నళ్ళయింది
ఏటా వచ్చేదిప్పుడు ఎటో వెళ్లిపోయింది
నాగలి కఱ్ఱు వేసే నలువారు చాళ్ళదువ్వెన
కనపడక అఱకను వెతుక్కొంటూ
అటెటో వెళ్లిపోయింది
అతీ గతీ లేదు; ఆనుపాన్లు అసలే వేవు
చేను చవిటి పఱ్ఱగ మారే
చలపొడుస్తున్న కాలం గదా
చలవ దుక్కులు పోయి
చాలా కాలమే అయింది
పురా వస్తుశాల వంటి పాత నిఘంటవుల్లో
స్వేచ్ఛావశేషాలు పడివున్న
విరిగిపోయిన మేడి ఒరిగిపోయిన కాడి
ఏ సంగీతాన్ని వినిపిస్తాయి?
గొంతులో స్వరాలేరుకొంటున్న సంగీతానికి
తెల్లవాఱు జాములు మోరెత్తడంలేదు
గిట్టలు తాటించే గిత్తదూడల మెళ్లో
కారెపు గంటలు మోగటమూ లేదు
ఆడు గడ్డ వేసే చేతులు
పారుబడ్డా యనుకొంటా
బీడుపడ్డ చేను బెంగటిల్లుతోంది
మెఱకచాళ్లు
గొఱ్ఱు వేళ్లు
మెత్తబళ్ళు
కలికానిగ్గూడా కనిపించటంలేదు
నెఱ్ఱెవచ్చిన చేను నిలువు లోతు రహస్యాన్ని
గాలి చెవికూది ఎన్నాళ్లయిందో
గట్టుమీద గొబ్బి ముల్లుగుచ్చుకోవటంలేదు
శబ్ద సముద్రం మధ్య
ఏకాంత నిస్పృహగా
ఎంత దిగాలు పడ్డది కొండ్ర..
‘పంపు’ మెఱకమీద
కావలి గూడు ‘జల్ల’ విరిగిపోయిందంటె
పడక సొంపు లేకనే, పరక గడ్డి లేకనే
‘ఈరిగాడి ఎఱ్ఱిప్రేమకు’
సద్దు నిక్కపొడుచుకొన్న చోటే
నిశ్శబ్దం పొలిమేరైంది. నిట్టూర్పు నెగడైంది
పంటకాల వొంపుల్లో
పరువం పరుగెత్తుతుంటే
గట్టు చెమరించేది- ఇపుడు
మబ్బు చెక్కే మారాం చేస్తోంది
ఆకాశం నుదురుమీది ఆకుపచ్చ చెమట చుక్క
మబ్బు చిచ్చోకం మీంచి
పండు కూతురు సీత బుగ్గమీద పడి
ఇంద్రధనుసుని విరవటం ఇప్పుడేది?
నారుమడే లేదు
నాట్లకు సీతాకోక చిలకలు వాలటమూలేదు
చేను చెంప చెమరింతల్లో
రంగులు ప్రతిఫలించటం లేదు..
ఏపుగా పెరిగిన పంటపొలతి
పైరు పైట గాలి కూగుతుంటే
గుబులు గుండెలు దాకా పాకి
శివమెత్తిన చెయ్దిం-నా
అవయవాల్ని అభిశంసిస్తోందిప్పుడు
జూకాల కులు
చిరునవ్వుల్ని- సిగ్గు కెంపుల్ని కలబోసుకొని
పొలం గుండెలమీద పరచుకొన్న
గాలి తెర మీద చిందువేస్తుంటే
పంట పొలాన్నైతే బాగుండునన్న
ఊహ రావటంలేదిప్పుడు..
నిన్న నెలవంక కొడవళ్ళు
గరగరించే గాజుల మోతని
గట్లు చేసుకొన్న పొలానికివాళ
గట్టూలేదు, గరువూ లేదు
గాలిమీద ఈత వేసే శ్రమ సౌందర్యానికి
‘గవర్నమెంటోళ్లు’
పనికి ఆహార పథకపు వల వేశారు
వల్లో పడింది శ్రమ
ఇప్పుడు వ్యవసాయం ఉత్త భ్రమ

- సాంధ్యశ్రీ