Others

జీవితాలను ప్రతిబింబించేవే కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హృది పేటికల్లో పదికాలాలపాటు పదిలపరచుకోగలిగేవే కథలు. కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నాలే. రచయిత కాల్పనిక దృష్టితో సృజించిన కథలు చదివించేవిగా ఉండొచ్చు. కానీ ఉపయోగ నిరుపయోగ విషయం ఆలోచిస్తే మాత్రం సమాధానం వెంటనే స్ఫురిస్తుంది.
పౌరాణిక, చారిత్రక, జానపద, సామాజిక మరియు భయానకాది కథా జగత్తులో సామాజిక స్పృహతో రచయిత తాననుభవించినవి, చూసినవి, గ్రహించినవి మరియు అనే్వషించిన కానేకాంశాలను కథా రూపంలో పాఠకాళికి అందించడం పరిపాటి.
వస్తూత్పత్తి సమాజం నుండే జరగాలి. ప్రజా సమస్యలు, నైతిక విలువలు, వ్యక్తి సంస్కారం, సమాజ సంస్కరణ, చైతన్యం మరియు మార్పు వంటి తదితర విషయాలు స్మృతిపథంలో మెదలిన మరుక్షణం పాత్రల సృష్టి జరగడం, సందర్భాలు మరియు సంఘర్షణలు చోటుచేసుకోవడంతో కథాగమనం చురుగ్గా సాగిపోతుంటుంది. మనుషులమధ్య ఉండాల్సిన సంబంధ బాంధవ్యాల విషయంలో తలెత్తే అనేకానేకమైన విషమ సమస్యలకు అద్దం పట్టడంలో ఈ కథా ప్రక్రియ ఎంతగానో దోహదపడుతుంది.
కథలంటే వినడానికి, చదవడానికి మరియు దృశ్యమానమైనప్పుడు చూడడానికి ఆబాలగోపాలం ఇష్టపడతారు. సరళమైన భాష, చకచకా సాగిపోయే వైనం, శిల్పం, చదివించే పదునైన శైలి వంటివన్నీ కథలకు ప్రాణం పోస్తాయి. పాఠకులను ఆలోచింపజేస్తూ ఆత్మవిమర్శ చేసుకునేలా చక్కగా మలచబడే కథలు ఎంతగానో జీవం పోసుకుంటాయి.
చేసిన తప్పులు సరిదిద్దుకునేలా, జీవితంలో మరోసారి ఆ తప్పులు చేయలేని విధంగా పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని గ్రహింపజేసే విధంగా ఉండే కథలు పుట్టుకొచ్చినపుడు మనుషులమధ్య ప్రేమాభిమానాలు పదింతలు పెరుగుతాయి. పశుత్వ లక్షణాలు తొలగిపోయి మానవత్వం పరిమళిస్తుంది.
పరివర్తన వైపు మనసులు మళ్లినపుడు సమాజం చైతన్యవంతవౌతుంది. కథాబలం సాధారణమైనదేం కాదు. కథా స్రవంతి కదిలించే దిశా సాగిపోతూనే వుండాలి. అప్పుడే కాల గమనంలో ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. కథకులందులకై ఉద్యమించాలి. ఆ ఉద్యమం నిరంతరాయంగా సాగిపోతూనే వుండాలి.
అప్పుడే చదువరుల సంఖ్యాబలం పెరుగుతుంది. పాఠకులు ఆలోచిస్తూ ఆచరిస్తూ పదిమందిని మార్చే ప్రయత్నం చేయడానికై ఎంతగానో తపిస్తుంటారు. ఆ తపన ఒక మహాప్రయోజనాన్ని ఆశించడంవల్ల కల్గిన కారణంగా సిద్ధించే ప్రయోజనం అంచనాలకు మించినదై ఉంటుందన్నది సత్యం సామీప్యం.
వాస్తవిక సామాజిక కథలల్లడంలో సమస్యలు పుట్టుకు రావడానికి గల కారణాలను సూచిస్తూ, పరిష్కార మార్గాలను తెలియజేయవలసిన బాధ్యత కథకులపై ఎంతైనా వుంది. సంస్కరణ దృక్పథంతో సాగిపోతే కథల్లో గ్రామీణ కథలు, నగర జీవిత కథలు, రాజకీయ కథలు, ఆర్థికపరమైన కథలు మరియు మనో వైజ్ఞానిక కథలు ఇలా కథా సాహిత్యం ఇలా శాఖోపశాఖలుగా విస్తరిస్తూనే వుంది. ఇతివృత్తం ఏదైనా సరే జీవితాన్ని కథ ప్రతిఫలించినపుడే ఆ కథ పాఠకుని హృదయంలో కి దూసుకెళ్లి హృదయపరివర్తనను కల్గజేయడం లో తన వంతు పాత్రను వహిస్తుంది. జాతీయో ధ్యకాలంలో నాటకాలు విరివిగా చూశారు జనాలు అంటే అది కేవలం అందులోని కథాగమనం వల్లే అన్నది నిశ్చతాభిప్రాయమే కదా.
ఏతావాతా చూస్తే వాస్తవికతకు అద్దం పట్టే కథలే జీవితాలను ప్రతిబింబిస్తాయి. కథామూలాలు బలంగా ఉంటూ సహజత్వాన్ని పుణికిపుచ్చుకోవాలి.. కథకులు కాల్పనీకతకు ప్రక్కన పడేసి వాస్తవాలను వెలికిదీసే ప్రయత్నంలో ముందంజలో ఉన్నపుడు సమాజం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే జీవితాలను ప్రతిబింబించేవే అసలు సిసలైన కథలు.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం