Others

యుద్ధరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేన వేల సూర్యకిరణాలతో అల్లుకుపోయిన వెలుతురు
భూమిని ముద్దాడింది మొదలు
మొదలయ్యే జీవనసంపుటి నుంచి
రక్తమాంసాలు నిండిన అక్షరాలు
అదేపనిగా రాలుతూనే ఉన్నాయి

ఏరుకుని కడుపు నింపుకునే పక్షులు
ఏరుదాటి తెప్పతగలేసే రకం కాదు
జీవవైవిధ్యపు పోకడలతో
జీవితాన్ని అనుక్షణం సమీక్షించుకుంటూనే ఉన్నాయి

చీకటి కమ్మేసిన రాతిరిలో
స్వప్న శకలాలతో జీవించు నక్షత్రాలు
రుతు సమూహాల్ని ప్రేమిస్తూ రాలిపోతుంటాయి
రాగం ఆలపిస్తున్న గాలితో చెట్టుకొమ్మలు

నిద్రలేచిన గొంతుక తోడుతో
రెక్కలు విచ్చుకున్న తూనీగ
రంగుల ఉత్తరీయం కప్పుకున్న సీతాకోకచిలుక
రివ్వున ఎగురొచ్చి వాలి

వెలుతురు తలుపులు తెరుస్తుంది
కలలు రాలని నిదురను మోస్తున్న నేను
శబ్దం చేయని కనురెప్పలు తెరుస్తాను
పలకరిస్తూ చీకటితెర మీద వెలుతురు మరకలు

మరకల మాటున దాగిన
గుండెను పిండేసే సమస్యలు
పరిష్కారానికి తెరలేపడానికి
సూర్యకిరణాల ఆసరాగా
యుద్ధరంగంలోకి అడుగిడుతూ

- కోడం పవన్ కుమార్.. 9848992825