Others

విశ్వశాంతి గీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వ శాంతి గీతం
మంచో చెడో
విషాదమో వికాసమో
ఏమైతేనేమి?
కొన్ని జ్ఞాపకాలనుపేర్చి
సెలవంటూ కాలం తరిలి వెళ్లింది
అడుగిడిన
నూతన వత్సరంలోనైనా
జీవన రీతుల కొత్తపుంతలు తొక్కిద్దాం
చెడు తలు (ల) పులు మూసి
మంచికి స్వాగత తోరణం కడదాం
సంకుచితత్వాన్ని సమాధిచేసి
విశాలభావనకు ఊపిరిపోద్దాం
ఆవేశాలకు అడ్డుకట్టవేసి
ఆలోచనలకు పదును పెడదాం
అజ్ఞాన చిమ్మచీకట్లు చెరిపి
విజ్ఞాన ప్రమిద వెలిగిద్దాం
అసమానతల అడ్డుతెరల తీసి
ఆత్మీయ లతలమై అల్లుకుందాం
ఆర్థిక బంధనాలను తెంచి
మానవ సంబంధాల ముడిపెడదాం
స్వార్థచింతనకు చితి పేర్చి
స్వేచ్ఛాజీవనకు బాటలు వేద్దాం
అమానుష కలుపు మొక్కల పెరికి
మానవతా చేల పచ్చగ పండిద్దాం
మూఢ వైఖరుల తిరస్కరించి
మనిషితనాల ఆవిష్కరిద్దాం
అచేతనను ఆధఃపాతాళం తొక్కి
నవ చైతన్య శిఖరం అధిరోహిద్దాం
కొత్త ఆశలు
కొంగొత్త ఆశయాలతో
ప్రగతి పథం వైపు అడుగు వేద్దాం
సౌఖ్యంగా, సమైక్యంగా
విశ్వశాంతి గీతాల పల్లవిద్దాం