Others

బొరుసు లేని బొమ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరికీ చెప్పొద్దు
నువ్వూ నేనూ మనం కాదు
నువ్వూ నేనూ పూర్తిగా నేనే
తనకు మొదటి నుండీ ఇదే ఆలోచన
నా వ్యక్తిత్వంలో కూడ
తన ఇష్టం నడవటం
లేదన్నదే సమస్య

తన ఇష్టం భంగపడటం
పనిమనిషి రాకపోవటం
వగైరా వగైరా వంటి కష్టాలు ఎదురైతే
నన్ను, ననే్న కాదు
నా తల్లినీ తిట్లతో ముంచెత్తుంది
మారే తన ఇష్టాలను,
రాబోయే నా కష్టాలను
ఊహించి నడుచుకోనందుకు
నాకు తిట్లు సరే!

ఎక్కడో ఉన్న నా తల్లికెందుకో
ఈ తిట్ల దండకాలు
నన్ను ఇలా పెంచి
తన పాల చేసినందుకంట!!!
నుంచోలేక, కూర్చోలేక
పడుకోలేక, పారిపోలేక

ఎప్పుడైనా గట్టిగా మాట్లాడితే?
తాగొచ్చి తంతున్నావని
కట్నం కావాలని వేధిస్తున్నావని
కేసుపెడతా నీ ఉద్యోగం పీకించి
నిన్ను రోడ్డుపై నిలబెడతా
తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త
అంటూ హెచ్చరిక!!

సానుభూతి లేని సమాజం
రెండోవైపు చూడలేని చట్టం
సిద్ధంగా ఉంటే ‘మృగాడు’ బిరుదు
ముక్కు పచ్చలారని
ఇద్దరు పిల్లలు ఇవి చాలవా
మూసుకొని ముడుచుకోవడానికి?

- కళ్ళేపల్లి తిరుమల రావు 9177074280