Others

పరుగులిడుతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకురాలి పడుతున్నది
చిగురై వికసించాలని
ఓటమి పరుగిడుతున్నది
గెలుపై భాసించాలని

ఆవేదనతోటి అవని
గుండె పగిలి పోతుంటే
మబ్బు పరుగు పెడుతున్నది
చినుకై వర్షించాలని

అజ్ఞానం ముసురుకున్న
మనిషి అంతరంగంలో
చీకటి అడుగిడుతున్నది
చిక్కగా విస్తరిద్దామని

ఎడారిలో పూలవనం
ఎదలను మీటేస్తుంటే
ఎండమావి వెడుతున్నది
నదియై ప్రవహించాలని

మమతలుడిగి మనిషి గుండె
బండబారిపోతుంటే
రాగం శ్రుతి కడుతున్నది
స్వరమై కరిగించాలని

అమానుషపు కోరలు తెగ
వేయుటకై తిరునగరి
కలం పదును పెడుతున్నది
శరమై విజృంభించాలని..

- తిరునగరి శ్రీనివాసస్వామి 9440369939