Others

ప్రతిరోజు పండుగైతే....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ మేధస్సు ముందు ప్రపంచమే గ్రామంగా మారినవేళ
ఆచారాలకు గ్రహణం పట్టగా, సాంప్రదాయాలకు వనె్న తగ్గిన తరుణంలో
ఆహారం, ఆహార్యం అన్నిటా పల్లెలు పట్టణాలతో పోటీ పడుతుంటే
అనురాగం ఆప్యాయతలు టి.వి. సెల్‌ఫోన్‌లకు పరిమితం కాగా
ఎప్పుడు డబ్బు ఉంటే అపుడే పండుగ
అనే నిర్లిప్తత జనంలో ఆవరించినవేళ
సంక్రాంతి పండగ రోజే మా గ్రామ దేవత జాతర రావటం
ఎక్కడెక్కడో ఉన్న ఆడపడచులు
అమ్మవారి ఆశీస్సుల కోసం
సకుటుంబ సపరివారంగా గ్రామానికి తరలిరావటంతో
మా వూరి మట్టిపరిమళం మరోసారి గుప్పుమంది
ఇళ్ళముందు తీర్చిదిద్దిన రంగవల్లులు
రమణుల ఏకాగ్రతకు సహనానికి ప్రతీకకాగా
వాకిట విరబూసిన ముద్దబంతులు చామంతులు
హేమంతానికి సీమంతం చేస్తున్నట్టు
నయనానందం కలిగిస్తుంటే
కర్ణపేయంగా సతాని జియ్యరుల గీతాలాపనలు
దైవనామ స్మరణతో కిటకిట లాడే దేవళాలు
బసవన్నల విన్యాసాలు భోగి మంటలకై
దుంగల దొంగల ఆరాటాలు
ఆసాదుల గరగ నృత్యాలు తీన్‌మార్ డప్పుల మోతలు
మందేసి చిందేసేవాళ్లు వాళ్లను చూసి ఆనందించేవాళ్లు
కోడి పందాలలో కోసు పందాలతో కొత్త అల్లుళ్ల కోలాహలం
ఓ పక్కసంక్రాంతి సంబరాలు
మరో ప్రక్క అమ్మవారి జాతర సందడే సందడి
పిన్నమ చేతి సున్నుండల ఘుమ ఘుమ
అత్తమ్మవండిన అరిసెల వాసన
అమ్మమ్మ గారెల కమ్మదనం
పండుగకే ఓ నిండుదనమిస్తే
ఖద్దరు పంచలో తాతయ్య
కాటన్లుంగీలు కట్టి నాన్న బాబాయిలు
కంచిపట్టుచీరలో కామాక్షిలా నానమ్మ
కాటన్ చీరల మహాలక్ష్మిలా అమ్మ
చిప్స్ వర్క్ చీరల్లో మురిసిపోతూ
మెరిసిపోతూ మేనత్తలు చిన్నమ్మలు
పరికిణీ ఓణీల్లో అక్కచెల్లెళ్లు
జీన్స్ టీషర్ట్‌ల్లో అన్నదమ్ముళ్లు
అందరిలోను అలవి కాని ఆనందం
జ్ఞాపకాల దొంతరల్లో మరో పుట చేరింది
మళ్లీ ఎన్నాళ్లకో ఈ పిలుపుల పలకరింపులు
మరి ఈ పండుగ ప్రతిరోజు వస్తేనే ప్రతిరోజు పండుగైతే....

హైమవతీ సత్య 9100735905