Others

సంబరాల సంకురాత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంతులకే రాజు రవీంద్రుడు
పండుగలకే వనె్న మకర సంక్రాంతి
పర్వదిన ఉషోదయం తెచ్చె
సంబరాల పూలతోటల పరిమళాలు

హరిదాసు కీర్తనల నాద సంగీతాలు
భోగి మంటల భోగభాగ్య తోరణాలు

గంగిరెద్దుల నాట్య విన్యాసాలు
గొబ్బెమ్మల దివ్య దీవెనల మూటలు

భోగిపళ్లు కురిపించె వరాల వర్షాలు
వాకిళ్లు ముద్దాడె ముత్యాల ముగ్గులు
నోరూరు సకినాలు , గారెల కరకరలు
తేనెలూరు రుచులు అరిసెబొబ్బట్లు
పళ్ళెంలో కొలువుతీరె పంచభక్ష్యాలు

కోడిపందాల పౌరుష క్రీడల కోలాహలాలు
ఎడ్లబండ్ల అరికె వ్యవసాయాలు
ఇళ్లన్నీ నిండెను సింగిడి నువ్వులు

పచ్చటి పొలాల్లో పడుచు పరికిణీలు
నిండుచూలాలైన గుమ్మలు గాబులు
చుట్టాలు పక్కాలు చెట్టపట్టాలు
మనసులన్నీ నిండె ప్రేమామృతాలు
తెలుగు వాకిళ్లన్నీ అనురాగ లోగిళ్లు
తోడ్కోని వచ్చె సౌభాగ్య పంటలు
ఊళ్లన్నీ అయ్యెను అక్షయ పాత్రలు

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి 9949700037