Others
చైతన్య చీకట్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
![](http://andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/20h2_2.jpg?itok=0bSHXzc2)
ఎన్నికల నగారా మోగింది!
ప్రచారాల సందడి రేగింది!
ఇంకేం!
కొత్తనాటకానికి తెరలేస్తోంది
బహురూపుల వేషాలు
రక్తికడుతాయిగా
ఎత్తుల కత్తులు మొలుస్తాయి
జిత్తుల పొత్తులు కుదురుతాయి
మిథ్యా పథకాలు చిగురిస్తాయి
అలవికాని హామీలు వర్షిస్తాయి
కుల సమీకరణలు సర్దుకుంటాయి
ఓటు బ్యాంకు లెక్కలు తూగుతాయి
పచ్చనోట్లు పడగ విప్పుతాయి
మద్యం బాటిళ్లు నోళ్లు తెరుస్తాయి
ఎటుచూసినా
ఆవకాశవాద ఆలింగనాలు
ఎటు విన్నా
సంకుచితపు ప్రేలాపనలు
మిత్రమా!
మాయ మాటలతో నిమ్మకుంటివో
మరో ఐదేళ్ల వెనుకబాటే సుమీ!
అందుకే
అమాయకత్వం త్యజించి
ఆలోచనలకుపదునుపెట్టు
ఆత్మవంచనల తుంచి
నైతిక విలువల పెంపొందించు
ప్రలోబాల మత్తుల జోగక
ప్రజ్ఞా పాఠవాల ప్రదర్శించు
కుళ్లు రాజకీయుల పక్కనెట్టి
సేవాతత్పరునికి పట్టం కట్టు
ప్రజాస్వామ్యానికి
పట్టిష్ట పరుచు