Others

వీర జవాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎటువంటి పరిస్థితులనైనా
తట్టుకునేలా తీసుకుంటారు శిక్షణ
వారి ప్రాణాల్ని ఫణంగా పెట్టి
అన్ని వేళళా ఇస్తారు మనకు రక్షణ

ఆ జీవితం దేశసేవకే అంకితం
ఆ శరీరం దేశమాత సేవలో పునీతం
ఆ చూపులు
ముష్కరుల కదలికలను గమనించు
ఆ చేతులు
శత్రువుల పీకలు కత్తిరించు

నిద్ర ఎరుగని కన్ను అతనిది
దేశసేవకే అంకితమైంది
దేశం కోసం తుపాకీ పట్టే
సైనికులు
సదాకాపాడుతారు మన జీవితాలు

నిలువెల్లా రక్తమోడుతున్నా
దేశమాత రక్షణలో మునిగేవాడు
మాంసం ముద్ద అయినా
మాతృభూమి సేవలో వెరవనివాడు

అతడే వీరకిశోరం
ప్రతిఫలం ఆశించక
చేస్తాడు ప్రాణత్యాగం
ధైర్యానికి నిలువెత్తు రూపం

అతని త్యాగానికి
ఏనాడు వెలకట్టలేం..
భరతమాత రక్షణలో మునిగిన
వీరత్వంమది
అఖండ భరతజాతి
చేస్తుంది మీకు వందనం

- కాళంరాజు వేణుగోపాల్... 8106204412