Others

జరభద్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోకిలను కాకి అంటారే
నరం లేని నరుల నాలుకలకు
నేనంటే ఎంత కపటప్రేమో కదా
కాలుజారితే సంబరంగా సంకలు కొడుతూ
ఎదిగిన క్షణం ఆత్రంగా ఎక్కిరిస్తూ
కోకిలను కాకిలా చిత్రించే
లోకులు పలుకాకులే సుమా
నేనూ ఓ బోడి కాకినేమో కదా!

సమాజమే ఎక్స్‌రే యంత్రమై
లోపాల్ని వేలెత్తి చూపే లోకం
మందివ్వలేని మరమనుషుల కాలం
ఇరుగు పొరుగును నిందించనేలా?

బతుకూ.. బరువూ నావే కదా
భరించ మరొకరెలా అవుతారు?

నా చెమట సఫల సంపదైన వేళ
నా వైపే చుట్టూ నెటిజన్లలా
అయస్కాంత ఇనుప రజను బంధంలా
బెల్లం చుట్టూ ఈగలౌతరు
ఈగల్ని తరిమి తేనె జుర్రుకోచూస్తారు!
ఆస్తి హరించి రిక్తహస్తుడనైన ఘడియ
నిన్నటి హిత హస్తాలే నేటి కరవాలాలై
నాలోని 3నన్ను2 నిర్దయగా నరికి
ఎండమావిని ఎరుక పరుస్తూ
ఎడారిలోకి తోసేస్తారు

జనం సుమా
జర భద్రం లేదంటే బతుకు ఛిద్రం

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి 99497 00037