Others

నేనో బీజం నా నైజం ఉపకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రణగొణ ధ్వనులు ఎక్కడో
నా ప్రక్కనే తవ్వుతున్నట్టు శబ్దం
సరిపోతుందా .. ఇంకా లోతుకెళ్లాలా?
ఏవేవో మంతనాలు
అది గొయ్యి అని అర్థమయ్యేలోపే
నన్నందులో పడేశారు
ఊపిరాడటం లేదు
నా కేకలు నాగొంతులోనే
ఉండిపోతున్నార గింజుకుంటున్నా
అయినా ఆపలేదు మట్టి చల్లటం
సొమ్మసిల్లి పడిపోయా
ఏం జరుగుతుందో? చీకట్లో దిగబడ్డా
మట్టి వేడిమికి మెలుకువొచ్చింది.
తడి తగలడంతో ప్రాణం తిరిగొచ్చింది
కొలిమిలో కూడా కొంత విశ్రాంతి అబ్బినట్టు
అయినా ఈ శిక్ష నాకెందుకు?
రూపమంతా మారిపోతోంది.
కోపమంతా మరిగిపోతోంది
తన్నుకొని బయటకొద్దామనే తపన
అయినా బలం లేదు నా దగ్గర
వానపాముల గుసగుసలు
ఉబ్బిపోతోంది శరీరం
దాపురిస్తుందా మరణం
ఎగసి తన్నా తల్లి గర్భం
పగిలి విచ్చుకుంది ఆవిర్భావం
కొత్త శ్వాసలో , కోటి అనుభూతులు
పంచభూతాల పరిభాషలు
పుట్టుకలోనే నా పోరాట
మంచికోసమే నా ఆరాటం
ఇంతకూ నేనెవరో చెప్పలేదు
కదూ! మీకు అర్థమయ్యిందనుకొంటాను
నిజంగా మీరు
ఊహించిందే బీజం నేను
ఉపకారమే నా నైజం
ఎదగడమే నా ప్రవృత్తి
కానీ మనిషిలో మృగం
నన్ను వికసించనిస్తుందా?
బతకనిస్తే
రేపటికి నేనో మహావృక్షాన్ని
మీ అస్తిత్వానికి చిరునామాను

-మాయకుంట్ల నారాయణరెడ్డి 9989686603