Others

సమయం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమయం లేదు
ఇప్పుడెవ్వరికీ సమయం లేదు
అల్లరిచిల్లరగా అల్లుకుపోయిన
తీగల్ని సవరించి
వాటి మొదళ్ళల్లో కాసిన్ని నీళ్ళు పోసే
సమయం లేదు
ఆకాశం కప్పుకున్న
మంచు దుప్పట్టాను
కొద్దిగా ప్రక్కకు జరిపి
నక్షత్రాల కళ్ళలోకి
తనివితీరా చూసే
సమయం లేదు
చెరువు అరుగు మీద
కునుకు తీస్తున్న
చందమామను
చేతులతో కదిపి
నీళ్ళన్నీ నిమ్మళించే దాకా
గట్టున నిల్చుని చూసే
సమయం లేదు
నేల మీద పొర్లాడే పూలతీగల్ని
పురికొసల చేతుల్లోకి చేర్చే
సమయం లేదు
డాబా మీద విరగకాసిన
కాసిని జాజిపూలను కోసుకొచ్చి
జేబులో వేసుకుని నడుస్తూ
అలసిపోయినప్పుడల్లా
తడిమి చూసుకొనే
సమయం లేదు
విసరివేయడానికి
నాలుగు మాటలున్నాయి కానీ
నలుగురూ కలసి
మెత్తగా నవ్వుకోవడానికి
సమయం లేదు
అమ్మ పొత్తిళ్ళల్లోని
పసిపాప నవ్వుల్లో
తడుస్తూ మురుస్తూ
బాల్యస్మృతుల్లోకి
జారుకునే
సమయం లేదు
ఉదయానే్న వాకిట్లో
ఒలికి హరివిల్లుల్ని
కళ్ళల్లోకి ఒంపుకుని
మనసు లాకర్లల్లో
దాచుకునే
సమయం లేదు
రోజుల్లో ఒక్క
అరగంట
పసిపిల్లలా
స్వచ్ఛంగా గడిపే
సమయం అసలే లేదు
కొన్ని అక్షరాల
పూసల్ని ముందేసుకుని
వాక్యాల దండలుగా గుచ్చి
దినచర్య పుస్తకం అట్టమీద
అందంగా అతికించుకునే
సమయమూ లేదు
కాలమనే ఇసుక తినె్నల మీద
వడివడిగా నడిచిపోవడమే తప్ప
ఓ మారు వెనక్కి తిరిగి
నడకవేపు దృష్టి సారించే
సమయం అసలే లేదు
జ్ఞాపకాల గట్టుమీద
జీవితాన్ని కాసేపలా ఆరబెట్టుకుని
రేపటిని కొత్తగాకలగనే
సమయం అసలే లేదు

సాంబమూర్తి లండ 974232008