Others
ఈ ప్రజాస్వామ్య దేశంలో..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 10 February 2020
-ఇంజమూరి మహేష్ యాదవ్
ప్రజాగొంతుకై నిలిచినోడి మీదికి విసిరిన
‘దేశద్రోహమనే బిరుదాస్త్రం’
అతడు గుండెనిండా
నింపుకున్న నిఖార్సైన
మార్క్సిజం కవచాన్ని ఛేదించలేకపోతుంది
ఖాకీల సంకెళ్ళు
అతని గుండె ధైర్యాన్ని తాకలేకున్నై
మొఖంపై చిరునవ్వుని బంధించలేకున్నై
కుట్రా రాజకీయాలేవీ,
దిక్కులు ప్రిక్కటిల్లేలా ప్రతిధ్వనించే
అతని ధిక్కార స్వరాన్ని
నిర్బంధించలేకున్నై
విద్యార్థులు,
మేధావుల గళాలన్నీ
‘కామ్రేడ్ కాశీం’ పేరు
నినదించినై
అదిగో అతని ఊపిరి ఉద్యమ
గీతమెత్తుకుంది
అదిగదిగో
అతని నిర్బంధం వేలాది
విప్లవ కవితలల్లింది