Others

రెప్పలు మూతబడేంత వరకూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నపళంగా
ఆశల దారాలు తెగిపోతాయి
మనసు గాలిపటం
ఊహల ఆకాశాన్ని వదిలి
నేలకు రాలిపోతుంది
నిశ్శబ్దాన్ని మింగిన మేఘమొకటి
అంతకంతకూ విస్తరిస్తుంది
శూన్యం తన గుహలాంటి నోరు తెరిచి
అమాంతం
ఆత్మవిశ్వాసాన్ని మింగేయాలని చూస్తుంది
కొడిగట్టిన ఆత్మస్థైర్యపు దీపం
గాలిలో రెపరెప లాడుతుంటుంది!
ఒక సందిగ్ధంలో
ఆలోచనలు లోలకంలా ఊగుతుంటాయి
అది చేతనకూ స్తబ్దతకు మధ్య
అడ్డుగీత చెరిగిపోతున్న సంధికాలం
అది పెనుగులాడటమో పారిపోవడమో
అలసత్వం లేకుండా
తేల్చుకోవాల్సిన సందర్భం!
అప్పుడే చప్పున నీలో నిప్పు రాజుకోవాలి
కప్పుకున్న దుప్పటి విదిల్చి
దిగ్గున మేల్కోవాలి
చారికలు కట్టిన చెక్కిళ్లను తుడుచుకోవాలి
పంటి బిగువున కష్టాన్ని కట్టేసి నిలబడాలి
జారిపడ్డామని ఆగిపోతే,
శిఖరాన్ని చేరేదెలా?
రెప్పలు మూతబడేంత వరకూ
రెక్కలు కదల్చడం ఆపేయకూడదు కదా!

-సాంబమూర్తి లండ.. 9642732008