Others
ప్రమాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 24 February 2020
-డా.ఎన్. గోపి
ఒకప్పుడు యాక్సిడెంటును చూస్తే
మనసు దిగ్భ్రమ చెందేది.
తెరిచి వున్న శవం కళ్లు
ఇంటిదాకా వెంటాడేవి.
మృత్యువును ప్రత్యక్షంగా చూసిన
జలదరింపు కలిగేది
ఆ వ్యక్తి స్థానంలో
మనముంటే అన్న భావన భయపెట్టేది
కొన్నాళ్ల దాకా
అన్నం సయించేది కాదు.
మరి ఇప్పుడు!
ప్రమాదాలు సాధారణమైపొయ్యాయి
తప్పెవరిది అన్న విశే్లషణ
ముఖ్యమయ్యింది.
పోయినవాడు
పొద్దున్నన్నా పోలేదు
ట్రాఫిక్ స్తంభించి
ఆఫీసుకు ఆలస్యవౌతున్నది.
ఒకప్పుడు
ప్రమాదం ప్రాణానికే జరిగేవి
కాని ఇవాళట్టి యాక్సిడెంటు
మనలోని మానవత్వానికి.
*