సబ్ ఫీచర్

పేరుకే ‘‘మేకిన్ ఇండియా!’’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోదీగారు రద్దుచేసిన ఐదువందల నోట్లుకి బదులుగా మింట్‌లో ప్రింటింగ్ ప్రెస్సుల్లో- ఇరవై నాలుగు గంటలూ నాన్‌స్టాప్‌గా ప్రింటు చేస్తున్నారు గానీ వాటికి అవసరమయిన కాగితం- హోషింగాబాద్ మిల్లునుంచి కోటి అరవై లక్షల టన్నులు వస్తూ వున్నా చాలక బ్రిటన్ నుంచి హుటాహుటీ తెప్పిస్తున్నారు. ఒక రకంగా అవి ‘విదేశీ’ కాగితం తయారీవే కాగా- ఈ ‘నోట్’లలో ‘సెక్యూరిటీ ధ్రెడ్’ నోటును ఎత్తిచూడగా కనబడే లోహ రిబ్బన్ కూడా మనది కాదు. దానిని కూడా బ్రిటన్, ఉక్రయిన్, ఇటలీల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మొత్తం నాలుగు ప్రింటింగ్ ప్రెస్సులు నిర్విరామంగా నోట్లు గుద్దేస్తున్నా కొరత తీరేలాగా లేదు అని, ఆర్.బి.ఐ. అధికారులే ఆందోళన చెందుతున్నారు. మధ్యప్రదేశ్ దేవాస్‌లోనున్న మైనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రెస్సు, మహరాష్టల్రోని నాసిక్- ప్రస్తుతం రోజుకి 90 లక్షల నోట్లు ప్రింట్ చేస్తున్నాయి. ఐతే, కర్నాటకాలోను, బంగలూరులోనూ కొత్త రెండు వేల రూపాయ నోట్లు- దొంగ దారంట ఎలా, ఎక్కువగా దొరుకుతున్నారుూ అంటే- రిజర్వు బ్యాంకు వారి ఆధ్వర్యంలోనున్న భారతీయ రిజర్వు బ్యాంకు నోటు ముద్రణ- ప్రయివేటు లిమిటెడ్ మైసూరులో వుంది. మరొకటి పశ్చిమ బెంగాల్‌లోని గిలోబనీలో వుంది. రోజుకో నాలుగు కోట్ల కరెన్సీ నోట్లు కొట్టి అవతల పడేస్తున్నాయి. కానీ, అవి ఏ మూలకి? బ్రిటన్ కాగితం, హోషింగాబాద్ కాగితం- సగం, సగంగా వాడుతున్నారుట. సిరా (ఇంకు) కూడా విదేశాలలో తయారై- స్థానిక కేంద్రాల ద్వారా మన ముద్రణాలయాలకి అందుతోందిట!
అలుపుసొలుపు లేకుండా- ‘షిఫ్ట్’ల మధ్య, ఊపిరి కూడా తీసుకోకుండా ముద్రణ సాగితే- మధ్యలో రిపేర్‌లూ, స్ట్రయికులూ లేకుండా- ఐదుమాసాల తరువాత చాలినన్ని కరెన్సీ కాగితాలు దేశం అంతటా లభించవచ్చును. బెంగపడితే ప్రయోజనం లేదు. దొడ్డిదారంట కొత్త నోట్లు బ్లాక్ మార్కెట్‌లోకి రాకుండా ఆపమని శ్రీమాన్ మోదీగారిని ప్రార్ధించడమే బెటర్!-
ఐతే, యిదిలా వుండగా న్యూఢిల్లీలో యిద్దరు ఏక్సిస్ బ్యాంకు మేనేజర్లని పోలీసులు- చిత్రంగా అరెస్ట్‌చేశారు. బ్యాంకుకి వచ్చిన గులాబీ నోట్లను వీళ్లు అక్రమంగా బయటవాళ్లకి యిచ్చేస్తున్నారు. దానికి బదులుగా - పాత నోట్లు కాదు- బంగారం కడ్డీ ఒకటి అందిపుచ్చుకున్నారు. దొరికిపోయారు!
బ్యాంకు నోట్ల మార్పిడి అనే లీగల్ మార్గంలో- ఇల్లీగల్‌గా- కొత్త నోట్లు యివ్వడంలో- చాలాచోట్ల బ్యాంకుల మ్యానేజర్లు - ‘పింక్ హ్యాండెడ్’గా- అంటే గులాబీ రంగు నోట్లతో దొరికిపోతున్నారు అన్నది వార్త.