Others

వెళ్లిపోరుూ.. ఉన్నాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాయితీపరుడే తూటాకు ఎదురు నిలుస్తాడు. -గుప్త్‌లో ఓంపురి పవర్‌ఫుల్ స్క్రీన్ డైలాగ్ ఇది.
నిజమైన నటుడే ఏ పాత్రనైనా పోషిస్తాడు. ఓంపురి గురించి చెప్పుకోవాల్సివస్తే ఇదీ అవుటాఫ్ ద స్క్రీన్ డైలాగ్.

నటుడికి కావాల్సింది గ్లామర్ కాదు, గ్రామర్ అని చెప్పినవాళ్లు చాలామందే ఉన్నారు. నిరూపించిన వాళ్ల జాబితాలో కొద్దిమందే ఉంటారు. అందులో ఓంపురి కూడా. అందుకే ఆయన వెళ్లిపోయనా.. మనమధ్యే ఉన్నట్టు అనిపిస్తుంటుంది. కొంతమంది గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే -అంత ఎక్కువ అర్థమవుతారు. ఈ క్యాటగిరీలో ఎవరికీ తక్కువకాకుండా ఓంపురినీ చేర్చాలి. భారతీయ సినిమా చరిత్రలో ఆయనదో శకం. హీరో అంటే అందంగా, ఆకర్షణీయంగా ఉండాలన్న సంప్రదాయానికి తెరదించాడు. సత్తావుంటే ఎలాంటి ఎత్తులైనా అధిరోహించవచ్చని నటనలో నిరూపించాడు. స్టార్ భేషజాలకు దూరంగా స్టార్‌గా వెలిగిన మామూలు నటుడు. ఓంపురి సినిమాల గురించి చెప్పుకోవాలంటే పదో పరకో ప్రస్తావించాల్సి రావొచ్చు. కానీ, ఆయన పోషించిన ప్రతి పాత్రనూ విశే్లషించుకుంటే ఒక్కో పాత్రపై ఒక్కో గ్రంథమే రాయాలి. ఆయన పోషించిన పాత్రలు అలాంటివి. విలక్షణమే లక్షణంగా ఎలాంటి పాత్రనైనా తన పంథాలోకి తీసుకుని పూర్తి న్యాయం చేయగలనని నిరూపించటమే కాదు, ఆ ఆత్మసంతృప్తినీ అనుభవించానని గొంతెత్తి చెప్పుకోగలిగే గొప్పనటుల్లో ఓంపురీ ఉంటారు. అందుకే -‘మనుషుల కోసం మతం.. మతం కోసం మనుషులు కాదు’ అంటూ ‘ఓ మై గాడ్’లో ఆయన చెప్పిన డైలాగ్‌ని ఓంపురి పోషించిన పాత్రలకు అన్వయించుకోవాల్సి వస్తుంది. ‘పాత్రల కోసం నటులుగానీ, నటుల కోసం పాత్రలు కాద’ని నిరూపించిన వాళ్లలో ఓంపురినీ ప్రత్యేకంగా చెప్పుకుని తీరాలి.
‘అర్థ సత్య’లో ఇన్‌స్పెక్టర్‌గా, ‘జానే బి దో యార్’లో అవినీతి ప్రాపర్టీ బిల్డర్‌గా, ‘ఆవారా పాగల్ దీవానా’లో బాబా బల్దేవ్ ప్రసాద్‌గా.. ఏ పాత్ర చేసినా అవే మన కళ్లముందుంటాయి గానీ, పాత్రధారి ఓంపురి కాదు. ద్రోహ్‌కాల్, మాచిస్‌లో పోషించిన వైవిధ్యమైన పాత్రల స్వభావ అర్థ తాత్పర్యాలు ఆడియన్స్ అనుభూతిలోకి తీసుకొచ్చిన ప్రతిభా సంపత్తి ఆయనకే సొంతం. ‘స్క్రీన్’ పరిధి దాటివెళ్లిన నటుడు కనుకే -ఇటు సమాంతర సినిమాలు, అటు న్యూవేవ్ సినిమాల్లోనూ రాణించగలిగారు. పెద్ద స్టార్లకు సవాల్ విసురుతూ కమర్షియల్ సినిమాల్లోనూ దూసుకుపోయారు. ద్రోహ్‌కాల్, మాచిస్‌లకంటే భూమిక, ఆక్రోశ్, జానే బి దో యార్ వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ఉద్గ్రంథాలే అనడం పూర్తి సత్యం. కేవలం హిందీ సినిమాకే పరిమితం కాకుండా తెలుగు (అంకురం) సహా పలు ప్రాంతీయ భాషా చిత్రాలపై తన ముద్ర వేసిన ఓంపురి, అంతర్జాతీయ తెరపైనా ఆయన నటనా వైదుష్యాన్ని రుచి చూపించారు. ‘ఈస్ట్ ఈజ్ ఈస్ట్’, ‘సిటీ ఆఫ్ జాయ్’ వంటి హాలీవుడ్ చిత్రాలు, వాటిల్లో ఆయన పోషించిన పాత్రలు ఓ భారతీయ నటుడికి లభించిన సముచితమైన గౌరవంగానే భావించాలి. ఆవేశం, ఆక్రోశం, ఉద్వేగం, ఉత్తేజం.. ఇవన్నీ ఆయన పాత్రల్లో కలబోసుకునేవి. ఇటు తిరుగుబాటు పాత్రవేసినా, అటు సమాజాన్ని చైతన్యపర్చే భూమిక పోషించినా ఆయా పాత్రల్లో ఒదిగిపోయి వాటి స్వభావాన్ని రక్తికట్టించగలిగే నటనా వైదుష్యాన్ని కనబర్చిన ఓంపురి.. భారతీయ సినిమా రంగానికే కాదు ఎల్లలులేని కళాసాగరంలో సినీ ప్రపంచానికి దొరికిన ఓ అరుదైన ఆణిముత్యం.
***
అనుకరణకు అవకాశంలేని నటనా శైలిని ఆవిష్కరించి -్భరతీయ సినీ కళా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు ప్రత్యేకంగా పదిలపర్చుకుని కనుమరుగయ్యారు ఓంపురి. ఆయన కళ్లముందు అంతర్థానమైనా -ఆయన వాచకం మనకూ వినిపిస్తూనే ఉంటుంది. ఆయన పోషించిన పాత్రలు, వాటిలోని గాఢత నులువెచ్చని సెగలా మనసులకు తగుల్తూనే ఉంటుంది. ఎప్పటికీ మర్చిపోలేని ఆయన గొంతును గుర్తు చేసే కొన్ని సంభాషణలను ప్రస్తావించుకుంటే..
‘ఓ మై గాడ్’ చిత్రంలో నిరుపేద షాప్‌కీపర్‌కు జరిగిన అన్యాయంపై కోర్టులో పోరాడే ముస్లిం దివ్యాంగ లాయర్‌గా -మనుషుల నుంచి మతం పుట్టుకొచ్చింది. మతం కోసం మనుషులు పుట్టలేద’న్న డైలాగ్ ఈడ్చి ముఖాన గుద్దినట్టు అనిపిస్తుంది మనకు. -నిజాయితీపరుడే తూటాకు ఎదురు నిలబడగలడు అంటూ ‘గుప్త్’ చిత్రంలో పొగరుబోతు పోలీసు ఉధంసింగ్ చెప్పిన డైలాగ్ ఓంపురిని మర్చిపోవడానికి చాన్స్ ఇవ్వదు. -యుద్ధం ఏదైనా సైనికుడు ఎంతోకొంత నష్టపోవడం అనివార్యం అంటూ ‘చైనా గేట్’లో సస్పెన్షన్‌కు గురైన కల్నల్ కృష్ణకాంత్ పూరీ చెప్పిన డైలాగ్ ఓ సైనికుడి ఆవేదనకు అద్దం పడుతుంది. ‘కుర్బాన్’ చిత్రంలో భయంకర ఉగ్రవాది పాత్ర పోషించారు ఓంపురి. -నమ్మకాలు కాలాన్ని అనుసరించాలి, అధిగమించకూడదు అంటూ పాత్రోచితంగా చెప్పిన డైలాగ్ బతుకు సత్యాన్ని ఆవిష్కరిస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. -నేను చావకముందే జుత్తుకు రంగు వెయ్యి. యవ్వనంగా ఉన్నపుడే చావాలనుకుంటున్నా అని ‘ఆవారా పాగల్ దీవానా’ చిత్రంలో బాబా బల్దేవ్ ప్రసాద్ పాత్రలో ఓంపురి డైలాగ్ చెప్పిన తీరు ఆయన నటనానుభవాన్ని రుచిచూపించక మానదు.
ప్రేమలో.. గాయం ఒకచోట బాధ మరోచోట -అని ‘మీర్జా’లో చెప్పినా, పేదలను గౌరవించలేని ప్రజాస్వామ్యం పట్ల నాకు గౌరవం లేదు -అని ‘చక్రవ్యూహ్’లో గర్జించినా.. నా ఆదేశాలు ఈ నగరానికి శాసనాలే -అంటూ ‘నర్సింహ’ స్టేట్‌మెంట్ ఇచ్చినా, మన వృత్తిలో కన్నీళ్లకు తావులేదు -అని మార్టె డామ్ టక్‌లో.. ఓంపురి చెప్పిన డైలాగులు ఆయా పాత్రల కోసం ఓంపురి అన్న విషయం మన అనుభూతికి రావడం ఖాయం. గత ఏడాది హిందీ వర్షన్‌లో వచ్చిన ‘జంగిల్ బుక్’లో భగీరా పాత్రకు గొంతునిచ్చిన ఓంపురి -నా శైలి నాదే. మరొకరికి అసాధ్యం అని స్టేట్‌మెంట్ ఇచ్చి మరీ వెళ్లిపోయాడు. భగీరా పాత్ర సంభాషణలు విన్నపుడు మన మనసుల్లో మెదిలే ఆలోచన అదే. దటీజ్ -ఓంపురి.

-మహాదేవ