కరీంనగర్

ప్రజా ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుట్ల, జనవరి 22:ప్రజా ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రైవేట్‌కు ధీటుగా మెరుగైన వైద్యం అందించేందుకు కోరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాసాగర్‌రావు తనయుడు సంజయ్‌కుమార్ వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తనయుడు సంజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఈఎన్‌టి మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ, ఉచిత వైద్య శిబిరాల ద్వారానే నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. ఉచితంగా 120మందికి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ గత ఏడాది ఉచిత వైద్య శిబిరం మెట్‌పల్లిలో, ఈ ఏడాది కోరుట్ల పట్టణంలో 2రోజుల మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో సబ్ కలెక్టర్ కె. శశాంక, మున్సిపల్ చైర్మన్ శీలం వేణుగోపాల్, కమిషనర్ వాణీ రెడ్డి, వైద్యులు దీన్‌దయాన్ బృందం, తహశీల్దార్ మధు, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్, ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు, ఆశా, అంగన్‌వాడీ, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.