రాష్ట్రీయం

ఫార్మాపై జాప్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: హైదరాబాద్‌లో నెలకొల్పె ఫార్పాసిటీ పట్ల జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతుండటంతో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం త్వరగా సమగ్రమైన నివేదిక తయారు చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దాదాపు 12 వేల ఎకరాల్లో ఫార్మా పరిశ్రమతో పాటు ఫార్మాసిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. అయితే ఫార్మా పరిశ్రమ వల్ల కాలుష్య సమస్యవలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు కోరారు. ఫార్మా పరిశ్రమలు ఎక్కువగా ఉన్న అమెరికా, జపాన్, యురప్ దేశాలలో పర్యటించి అక్కడ కాలుష్య వ్యర్ధాల నిర్వాహణ కోసం అనుసరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయాలన్నారు. తన కార్యాలయ అదనపు కార్యదర్శి శాంతకుమారి నేతృత్వంలో అధికారుల బృందాన్ని ఆయా దేశాలకు పంపాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నిర్ణయించారు. వ్యర్థాల ట్రీట్‌మెంట్ సక్రమంగా జరగడానికి తగిన ముందస్తు ఏర్పాట్లు తీసుకోవాలని, ఫార్మాసిటీ పట్ల జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని కెసిఆర్ తెలిపారు. ఫార్మాసిటీ నూటికి నూరు శాతం ప్రమాద రహితంగా, వ్యర్ధాలు బయటికి వచ్చే అవకాశం లేకుండా చూడాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. గతంలో నెలకొల్పిన ఫార్మా పరిశ్రమల వల్ల కొన్ని ప్రాంతాలు పూర్తిగా కలుషితం అయ్యాయని ఈ పరిస్థితి పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు.