బిజినెస్

ప.గో.లో మెగా ఆక్వా ఫుడ్‌పార్కు నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జనవరి 22: డాలర్ల పంటగా పేరున్న రొయ్యల సాగుకు గోదావరి జిల్లాల్లో పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఈ జిల్లాల్లో వరిసాగులో నష్టాలను చవిచూస్తున్న రైతన్నలకు ఆక్వా పరిశ్రమ ఊతమిస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ప్రకృతి కరుణించక తరచూ దక్కించుకోలేకపోతున్న రైతన్నలకు ఆక్వాసాగు ప్రత్యామ్నాయంగా నిలిచింది. దీంతో డెల్టాలోని పలువురు రైతులు చేలను చెరువులుగా మార్చి రొయ్యలు, చేపల సాగు చేపట్టారు.
ఇక్కడి నల్లరేగడి మట్టిలో పండించిన రొయ్యకు అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉండటంతో డాలర్ల వర్షం కురుస్తుంది. ఏటా మన దేశం నుండి వేల కోట్ల రూపాయల విలువైన రొయ్యలు ఎగుమతి అవుతుండగా, అందులో అత్యధిక శాతం ఆంధ్రప్రదేశ్ నుండి, అదీ గోదావరి జిల్లాల నుండే కావడం గమనార్హం. అయితే ఈ పరిశ్రమలో కూడా కొన్ని ఇక్కట్లు తప్పడం లేదు. అంతర్జాతీయ ధరల ఆటుపోట్ల కారణంగా రైతులు, ఎగుమతిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ‘గోదావరి ఆక్వా మెగా ఫుడ్‌పార్కు’ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్ మండలం తుందుర్రు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం, ఆనంద ఫౌండేషన్ సంయుక్తంగా రూ. 101.45 కోట్ల వ్యయంతో 1.70 ఎకరాల విస్తీర్ణంలో చేప, రొయ్య ప్రాసెసింగ్ ప్లాంటు, మూడు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన కోల్డ్‌స్టోరేజీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంటు దేశంలోనే తొలి ప్లాంటు కావడం విశేషం.
ఏం జరిగేది...
వరిసాగు నుండి ఆక్వా సాగులోకి వచ్చిన రైతులు పలువురు అనుభవం లేక నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పూర్తిగా ఎగుమతులపై ఆధారపడిన వ్యవహారం కావడంతో అంతర్జాతీయంగా వివిధ దేశాల నుండి ఏర్పడిన పోటీ, నిత్యం ధరల్లో హెచ్చుతగ్గుల కారణంగా రైతులు, ఎగుమతిదారులు నష్టపోయేవారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మెరుగైన ధర లభించాక అమ్ముకోవడానికి ఇక్కడి రైతాంగానికి అవకాశం లేదు. రొయ్యల సాగు చాలా సున్నితమైన వ్యవహారమని చెప్పవచ్చు.
పట్టుబడి తరుణం సమీపించినా, చిన్నపాటి వాతావరణ సమస్య తలెత్తినా వెంటనే పట్టుబడి జరిగిపోవాలి. లేదంటే రైతు పరిస్థితి జీరో అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పట్టిన రొయ్యలు వెంటనే అయినకాడికి అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ ధరల ఆటుపోట్లతో ఒక్కోసారి కనీసం సాగు ఖర్చులు కూడా రాని ధర ఉన్నా అమ్మేయాల్సిందే. అయతే ప్రస్తుతం నిర్మిస్తున్న ఆక్వా మెగా పార్కు వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరనుంది. పట్టుబడి నిర్వహించిన రొయ్యలను లాభాసాటి ధర లభించాకే అమ్ముకునే అవకాశం లభిస్తుంది. మెగాపార్కు లో నిర్మిస్తున్న భారీ కోల్డ్‌స్టోరేజిలో రైతులు రొయ్యలను నిల్వచేసుకునే అవకాశం ఉండటంతో ధరల ఆటుపోట్ల ప్రభావం నుండి బయటపడతారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో మెగా ఫుడ్‌పార్కు
భారతదేశంలోనే గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కు తొలి ప్రాసెసింగ్ ప్లాంటు అని చెప్పవచ్చు. దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తోంది. ప్రతీ ఏడాది 18వేల టన్నుల చేప, రొయ్యలను అతి తక్కువ నీటి వినియోగంతో ఇక్కడ ప్రాసెసింగ్ చేస్తారు. ప్లాంటు వల్ల ఎటువంటి కాలుష్య సమస్యలు తలెత్తకుండా ఈటిపి ప్లాంట్లను కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది. కేవలం 0.0429 క్యూసెక్కుల నీటిని మాత్రమే ఈ ప్రాసెసింగ్ ప్లాంటుకు ఉపయోగించడం అంతర్జాతీయ ప్రమాణాల్లో ఒక భాగం. వీటితోపాటు గ్రీన్‌బెల్టును కూడా అభివృద్ధి చేయనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాను ఆక్వా హబ్‌గా ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఆనంద ఫౌండేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న మెగా ఆక్వా ఫుడ్ పార్కుతో ఇక్కడి రొయ్య రైతుల ఇక్కట్లు తీరతాయని చెప్పవచ్చు.