తెలంగాణ

ప్రచారానికి కేంద్ర మంత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగు దేశం-బిజెపి అభ్యర్థుల విజయం కోసం ఆ రెండు పార్టీలూ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ శనివారం పార్టీ కార్యాలయం ఆవరణలో ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు. మరోవైపు ఈ నెల 26 నుంచి కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 26వ తేదీన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు గ్రేటర్ పరిథిలో రెండు సభల్లో పాల్గొననున్నారు. 28న కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ప్రచార నిమిత్తం రానున్నారు. ఇంకా కేంద్ర మంత్రులు షానవాజ్ హుస్సేన్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, ప్రకాష్ జవదేకర్, హన్సరాజ్ ప్రభృతులు హైదరాబాద్‌కు రానున్నారు. కేంద్ర మంత్రులతో వేర్వేరుగా సుమారు 40 నుంచి 45 డివిజన్లలో ప్రచార సభలు నిర్వహించేందుకు పార్టీ రాష్ట్ర నాయకులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ముఖ్యమైన కొన్ని డివిజన్లలో రోడ్-షోలు నిర్వహించేందుకూ కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు కేంద్ర మంత్రులు, మరోవైపు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలు, రోడ్-షోలతో ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు ఇరు పార్టీల నేతలు చర్చిస్తున్నారు. సెటిలర్లు అధికంగా ఉన్న డివిజన్లలో టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.