తెలంగాణ

ప్రచారంలో మంత్రులు..సచివాలయంలో అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: ముఖ్యమంత్రి మినహా మంత్రివర్గం మొత్తం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మంత్రులంతా ప్రచారంలో ఉండడంతో సచివాలయంలో అధికారులు మాత్రమే కనిపిస్తున్నారు. మంత్రులు లేకపోవడం వల్ల సందర్శకుల సందడి కూడా తగ్గింది. చివరి రెండు రోజులు ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రెండు బహిరంగ సభలు, ఈ- సభల ద్వారా ఎన్నికల ప్రచారం సాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ముఖ్యమంత్రి ప్రచారానికి దూరంగానే ఉన్నా క్యాంపు కార్యాలయంలోనే ఉంటున్నారు. ఇక అధికారులంతా సచివాలయంలో ఉండగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మిషన్ భగీరథ పథకం కింద తొలివిడత తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇంటింటికీ తాగునీటిని అందించనున్నారు. ఈ పనులను పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మెదక్ జిల్లాలో పర్యటించారు. శనివారం రోజున వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో పర్యటించారు. స్టేషన్ ఘనపూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు మంత్రులు సచివాలయంలో అధికారిక కార్యక్రమాలకు దూరంగానే ఉండాల్సి రావడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షలు జరపడంతో పాటు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మంత్రులు నగరంలో ప్రచారం ముగించుకుని అడపాదడపా సచివాలయానికి వచ్చిన సమీక్షలకు పరిమితం అవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు టిఆర్‌ఎస్ తరఫున పూర్తి బాధ్యత ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తీసుకున్నారు.
నోటిఫికేషన్ విడుదలకు ముందు నుంచే కెటిఆర్ ఎన్నికల ప్రచారంలోకి దిగారు. అప్పటి నుంచి పంచాయితీరాజ్ శాఖతో పాటు ఐటి శాఖకు సంబంధించి అధికారిక కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. టి-హబ్‌లో కీలక ఒప్పందాలు జరిగినప్పుడు హాజరు కావడం మినహా పూర్తిగా గ్రేటర్ ఎన్నికలకు పరిమితం అయ్యారు. నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎక్కువగా నారాయణఖేడ్ ఉప ఎన్నికలపై దృష్టిసారించారు. గ్రేటర్ పరిధిలో కొన్ని సమావేశాలు నిర్వహించినా ఎక్కువగా నారాయణఖేడ్‌లో సభలు నిర్వహిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పాతనగరంలో పర్యటిస్తున్నారు. బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న, ఎక్సైజ్ శాఖ మంత్రి టి పద్మారావు, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ఎక్కువగా సికిందరాబాద్, సనత్‌నగర్ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
కడియం శ్రీహరి ఉప్పల్‌లో సమావేశం నిర్వహించిన తరువాత విద్యా సదస్సు కోసం విదేశీ పర్యటనకు వెళ్లారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రచారం సాగిస్తున్నారు. ఎల్‌బి నగర్ నియోజకవర్గం పరిధిలో నల్లగొండ జిల్లాకు చెందిన వారు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆ ప్రాంతంపై దృష్టిసారించారు. అల్వాల్ ప్రాంతంలో కరీంనగర్ జిల్లా వారు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆప్రాంతంలో ప్రచారం చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఒకవైపు జిల్లాలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ మరోవైపు గ్రేటర్‌లో ప్రచారం సాగిస్తున్నారు. మంత్రి లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు.