రాష్ట్రీయం

పరిటాల బాటలోనే సాగుతున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, జనవరి 24: దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర చూపిన మార్గంలోనే తాము కూడా నడుస్తున్నామని ఆయన సతీమణి, పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో ఆదివారం పరిటాల రవీంద్ర 11వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచే కాక రాష్ట్ర నలుమూలల నుంచి, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది మంది పరిటాల రవీంద్ర అభిమానులు తరలివచ్చారు. అభిమానులు పెద్దఎత్తున తరలిరావడంతో వెంకటాపురం జనసంద్రమైంది. ఉదయం మంత్రి పరిటాల సునీత, తనయుడు శ్రీరామ్, కుమార్తె స్నేహలత, వారి కుటుంబ సభ్యులతో కలిసి పరిటాల ఘాట్‌పై పుష్పగుచ్చాలు వుంచి నివాళులు అర్పించారు. అలాగే జిల్లాలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సునీత మాట్లాడుతూ పరిటాల రవి వర్ధంతిని దేశ, విదేశాల్లో జరుపుకోవడం ఆయన పట్ల వున్న అభిమానానికి నిదర్శనమన్నారు. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్టు తరపున ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, జడ్‌పి చైర్మన్ చమన్‌సాబ్, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, అనంతపురం మేయర్ స్వరూప, ఎమ్మెల్సీ తిప్పేస్వామి, ఎమ్మెల్యేలు బికె.పార్థసారధి, ప్రభాకర్‌చౌదరి, హనుమంతరాయచౌదరి, ఈరన్న, జితేంద్రగౌడ్, నాయకులు హిందూపురం రంగనాయకులు, కరణం బలరాం కుమారుడు వెంకటేష్, పోతుల సురేష్, ఎల్.నారాయణచౌదరి, రామ్మూర్తినాయుడు, తదితరులు పరిటాల రవి ఘాట్‌పై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు.