ఆంధ్రప్రదేశ్‌

పేదరికం లేని సమాజమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల తాను ప్రయత్నిస్తుంటే, మరోపక్క కొన్ని దుష్టశక్తులు కుటిల రాజకీయాలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం విశాఖ జిల్లా చినగదిలి మండలం చంద్రంపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కులం పేరుతో నిర్వహించిన సభలో రైలును తగులబెట్టి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విధమైన పైశాచిక ఆనందం ఉండరాదన్నారు. పేదరికం లేని సమాజం, ఆనందంతో నిండిన సమాజాన్ని తాను కోరుకుంటున్నానన్నారు. అందువల్లనే విద్యకు, మానవ వనరులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నానన్నారు. రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి కష్టాలు ఎదురైనా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. ప్రపంచంలో చైనా, జపాన్, యూరప్‌లో కంటే ఒక్క భారత్‌లోనే యువత ఉందన్నారు. విద్యతోనే పేదరికాన్ని నిర్మూలించగలమన్నారు. భారత్‌కు అభివృద్ధి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని వివరించారు. ప్రపంచ వృద్ధి రేటు 2.5 నుంచి 3 శాతం ఉండగా, భారత్ వృద్ధి రేటు 7.5 నుంచి 8 శాతం ఉందన్నారు. భవిష్యత్‌లో 10 శాతానికి చేరుకుంటుందన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 11.77 శాతంగా ఉందన్నారు. ఇందుకు ఆయన మైక్రోసాఫ్ట్ అధినేత నాదెళ్ల సత్య, గూగుల్ అధినేత సుందర పిచాయ్‌లను ఉదహరించారు. విద్యార్థుల తమ శక్తి సామర్థ్యాలతో పైకి ఎదగాలని కాంక్షించారు. సమాజంలో ఏ సమస్యకైనా విద్యతోనే పరిష్కారం లభిస్తుందన్నారు. విద్య ద్వారా సంపద పెరగడమేగాకుండా ఇతర సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. కాగా, ఈ పాఠశాల మాదిరిగానే ఇతర పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని ఆయన మంత్రి గంటా శ్రీనివాసరావును కోరారు. ముందుగా విద్యార్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రిడ్‌లు, మిషన్లు, ప్రచారాల గురించి విద్యార్థులు వివరించారు. పాఠశాలలో డిజిటల్ తరగతుల ఉపయోగం, కుల, మత, వర్గ, విభేదాలను నిర్మూలించాలంటే ఏం చేయాలి? స్మార్ట్ సిటీ తదితర వాటిపై విద్యార్థులు చెప్పిన సమాధానాలను ఆసక్తిగా విన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం చినరాజప్ప, ఎంపిలు కె. హరిబాబు, అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, జిల్లా కలెక్టర్ యువరాజ్, తదితరులు పాల్గొన్నారు.