రాష్ట్రీయం

పాఠశాలల్లో వసతులకు రూ.900 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 21: రాష్ట్రంలో సర్వశిక్ష అభియాన్ ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు జాతీయ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (హెచ్‌ఆర్‌డి) కార్యదర్శి మంజిత్‌కుమార్ చెప్పారు. గురువారం విశాఖలో జరిగిన సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ఆర్థిక కంట్రోలర్ల జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో వౌలిక వసతులు కల్పించేందుకు ఈ ఏడాది రూ.900 కోట్లు మంజూరు చేశామన్నారు. 2016-17 విద్యా సంవత్సరంలో కొత్తగా 3843 మోడల్ స్కూళ్లను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రాథమిక విద్య బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నామన్నారు. 2050 నాటికి విశాఖ జిల్లాలో అన్ని పాఠశాలలకు పూర్తి స్థాయిలో వౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఇదిలా ఉండగా ఏటికొప్పాకలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, ఐటిఐ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. అలాగే సర్వశిక్ష అభియాన్ ద్వారా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రెండు జతల యూనిఫారాలు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో 48 లక్షల మంది విద్యార్థులకు యూనిఫారం అందజేయనున్నట్టు తెలిపారు.