రాష్ట్రీయం

ప్రేమికుల రోజు అరెస్టుల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ప్రపంచ ప్రేమికుల దినాన్ని జరుపుకుంటున్న పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదివారం నగరవ్యాప్తంగా వాలెంటైన్స్ డే జరుపుకునేందుకు యువతీయువకులు ఉత్సాహం చూపుతున్న నేపథ్యంలో విదేశీ సంస్కృతిని ప్రదర్శించొద్దంటూ, బజరంగ్‌దళ్ కార్యకర్తలు సికిందరాబాద్‌లో ప్రేమికుల దినానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. బజరంగ్‌దళ్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ గుప్తా ఆధ్వర్యంలో ప్రేమికుల దినోత్సవ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పలుచోట్ల యువతీ యువకులను అడ్డుకున్నారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన మానవహారం, ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురి అరెస్టు చేశారు. నగరంలో పలుచోట్ల వెలసిన వాలెంటైన్స్ డే పోస్టర్లు, బ్యానర్లను తొలగించారు. పాతబస్తీలో పలుచోట్ల ఆర్‌ఎస్‌ఎస్, బజరంగ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ప్రేమికుల రోజును జరుపుకుంటున్న యువతీయువకులను అడ్డుకున్నారు. కాగా ప్రేమికులపై దాడులు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఆదివారం సాయంత్రం బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కొన్ని విద్యార్థి సంఘాలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. సభకు అనుమతి లేదంటూ పోలీసలు ఆదివారం ఉదయం నుంచే యూనివర్శిటీ నుంచి విద్యార్థులెవరినీ బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. కాగా ఎబివిపి విద్యార్థి సంఘం ప్రేమికుల దినానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో కొందరు విద్యార్థులు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా బహిరంగ సభ నిర్వహించేందుకు హాస్టళ్ల నుంచి ఒక్కసారిగా ఆర్ట్స్ కళాశాల వైపు రావడంతో పోలీసులు వారిని అడ్డుకుని, అరెస్ట్ చేశారు. పలువురు ఎబివిపి, ఎస్‌ఐఎఫ్, ఎఐఎస్‌ఎఫ్, టిఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.