రాష్ట్రీయం

పెళ్లిళ్ల వెబ్‌సైట్లకు ముకుతాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ఆన్‌లైన్ పెళ్లిళ్ల పేరయ్యలుగా ముద్రపడిన మేట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా వధూవరులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. మేట్రిమోనియల్ వెబ్‌సైట్లను అడ్డుపెట్టుకుని అమాయక యువతీ యువకులను వలలో వేసుకుని లక్షలు గడిస్తున్న మోసగాళ్లపై కుప్పలు తెప్పలుగా వస్తున్న ఫిర్యాదుల మేరకు ఈ సమస్య పరిష్కారానికి అడ్డుకట్ట వేయాలని కేంద్రం భావిస్తోంది. హోంశాఖ, ఐటి శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, న్యాయ శాఖలతోపాటు ఒక న్యాయ నిపుణుడితో సహా సభ్యులుగా కేంద్ర మహిళా సంక్షేమ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 15 రోజుల్లో ఒక నివేదికను కేంద్రానికి సమర్పించనుంది.
ఈ వివరాలను మహిళా శిశు సంక్షేమ శాఖ కేంద్ర కార్యదర్శి వి సోమసుందరం తెలిపారు. తమ గురించి లేనిపోని మాయమాటలను చెప్పి అమ్మాయిలను బుట్టలో వేసి వారి వద్ద నుంచి భారీఎత్తున సొమ్ము వసూలు చేసి మోసం చేస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదులకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
మేట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో ఒక యువతి లేదా యువకుడు తమకు నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకునేందుకు పేరును రిజిస్టర్ చేసుకుంటారు. ఇకపై రిజిస్ట్రేషన్ సమయంలో కచ్చితంగా ఆధార్ కార్డు, వోటర్ కార్డు లేదా పాన్ కార్డు లేదా పాస్‌పోర్టు లేదా ఏదైనా గుర్తింపు కార్డు నంబర్‌ను జతపరచాల్సి ఉంటుంది. త్వరలో కేంద్రం జారీ చేసే మార్గదర్శకాల్లో ఈ నిబంధన ఉంటుం ది. ఐదు శాఖల అధికారులు తమ నివేదికను డిపార్టుమెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీకి ఇవ్వాల్సి ఉంటుంది. దేశంలో ఆన్‌లైన్ పెళ్లిళ్ల వెబ్‌సైట్లు చాలా ఉన్నాయి. వీటిని నియంత్రించేందుకు నిబంధనలు లేవు. ఇందులో 20 వరకు కోట్లాది రూపాయల వ్యాపారం చేసే మెట్రిమోనియల్ వెబ్‌సైట్లు ఉన్నాయి. ప్రస్తుత అంచనా ప్రకారం దేశంలో ఆన్‌లైన్ పెళ్లిళ్ల మార్కెట్ సైజు రూ.400 కోట్ల వరకు ఉంటుందని. ఉదాహరణకు భారత్ మేట్రిమోనికి 1.4 మిలియన్ల మంది, షాది.కామ్‌కు 1.2 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ వెబ్‌సైట్లు ఫిర్యాదు చేసేవారి కోసం పరిష్కార కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కేంద్రం జారీ చేసే మార్గదర్శకాలు ఐటి చట్టం పరిధి కిందకు వస్తాయి. దేశంలో ప్రస్తుతం 402 మిలియన్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఇంటర్నెట్ యూజర్లలో చాలామంది వివాహం కోసం ఆన్‌లైన్ మెట్రిమోనియల్ వెబ్‌సైట్లను ఆశ్రయిస్తున్నారు. తల్లితండ్రులు కూడా వెబ్‌సైట్ రిజిస్ట్రేషన్ల పట్ల మక్కువ చూపుతున్నారు. 2011లో సైబర్ కేఫ్‌ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. ఐడి ప్రూఫ్ లేని పక్షంలో యూజర్లకు ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయరాదనే షరతను కేంద్రం అమలు చేస్తోంది. ఇప్పుడు కూడా కేంద్రం జారీ చేసే మార్గదర్శకాల వల్ల పూర్తిగా మోసాలు అరికట్టలేకపోయినా, కొంత వరకు అయినా చెక్ పెట్టినట్లవుతుంది.
ఆన్‌లైన్‌లో కొంత మంది యువతులు లేదా యువకుల అందమైన ఫోటోలు, వారి బయోడేటాను చూసి మోసపోయేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. సైబరాబాద్ పరిధిలో మాధురి అనే యువతి ప్రొఫైల్‌ను ఆన్‌లైన్‌లో చూసి బెంగళూరుకు చెందిన ఒక యువకుడు పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చారు. పెళ్లికాకుండానే రాకపోకలు సాగించి, మాధురి చెల్లెలికి బెంగళూరులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 1.5 లక్షల రూపాయలు తీసుకుని ఉడాయించాడు. డబ్బు అడిగితే సోషల్‌మీడియాలో ఆ యువతి ఫోటోను మార్ఫ్ చేస్తానని బెదిరించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ యువకుడు నిత్య పెళ్లికొడుకని, పైగా వెబ్‌సైట్ ద్వారా 700 మందితో టచ్‌లో ఉన్నట్లు తేలింది. ఈ తరహా ఫిర్యాదులు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లకు తరచుగా అందుతున్నాయి.