అక్షర

ఆలోచింపజేసే ‘పక్షుల సభ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పక్షుల సభ- పరీద్ ఉద్ దిన్ అత్తర్
రచన: డా.లంకా శివరామప్రసాద్
పేజీలు: 168; వెల: 200 రూ.
సృజన లోకం- ప్రశాంతి హాస్పిటల్,
శివనగర్, వరంగల్- 506002
ఫోన్- 8897849442

హజ్రత్ షేఖ్ పరీదుదీన్ అతార్ 12వ శతాబ్దినాటి సూఫీ. ప్రస్తుతం ఈరాన్‌గా గుర్తింపు పొందుతున్న ప్రాంతంలో నిషాపూర్ అనేచోట ఆయన పుట్టాడు. జ్ఞానం సంపాదించాలని ఆయన ఈజిప్ట్, డమాస్కస్, భారతదేశం మరిన్ని ప్రాంతాలు తిరిగాడు. తిరిగి తన స్వంతచోటికి చేరి రచనా వ్యాసంగం సాగించాడు. ఆయన రచనలు ముప్ఫయి దాకా నేటికీ అందుబాటులో ఉన్నాయి. మంతఖ్-ఉల్-తైర్ అన్న రచన వాటన్నింటిలోనూ ప్రధానమయినది. ఆ మాటకు పక్షుల మాటలు అని అర్థం. ఈ గ్రంథం వంద సంవత్సరాలనాడే ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషలలోకి అనువదింపబడింది. అసలు రచన, అనువాదాలు కవిత రూపంలో ఉంటాయి. వాటి ఆధారంగా వచ్చిన వచన రూపాన్ని ప్రస్తుతం తెలుగులో అందించారు ఈ రచయిత. ఈయన ప్రపంచ సాహిత్యంలోని 26 గ్రంథాలను ఇప్పటికే అనువాదాలుగా అందించారు.
ఈ పుస్తకంలో కొన్ని పక్షుల, ఒక గురుపక్షి సాయంతో తమ నాయకుని కొరకు వెతికిన తీరు వర్ణింపబడింది. ఈ పక్షులంటే సూఫీ సాధకులే. సూఫీ పద్ధతిలో పాఠాలను కథల రూపంలో చెప్పే సంప్రదాయం ఉంది. ఆలోచన కలిగించే పద్ధతిలో పక్షులకు, గురుపక్షికి మధ్యప్రశ్నోత్తరాలు సాగుతాయి. ఉదాహరణగా అన్నట్టు అడుగడుగునా కథలుంటాయి. నాయకుని చేరాలంటే ఏడులోయలు దాటాలని అంటారు. అనే్వషణ, ప్రేమ, అంతర్ద్రష్టి, బంధన రాహిత్యం-ప్రశాంతత, ఏకత్వం, ఆశ్చర్యం, శూన్యం అన్నవి ఆలోతులు. ఈ మాటలు చూస్తేనే రచనలోని అసలు తత్వం అర్థమవుతుంది.
ఇది కాలక్షేపంకొరకు చదవదగిన పుస్తకం కాదు. ఒక్కసారిగా చివరివరకూ చదవదగినది అంతకన్నా కాదు. అంచెలంచెలుగా చదవాలి. అడుగడుగున ఆలోచించాలి. ఆలోచింపజేయడమే ఈ పుస్తకంలోని ఆంతర్యం. ఎక్కడ మొదలుపెట్టి చదివినా నిజంగా విషయం పట్ల కొద్ది ఆసక్తిగలవారు కూడా పూర్తి రచనను తప్పక చదువుతారు. చదవాలి కూడా. పక్షులలో పెద్దదికు హోపో కూడా వాటిని ప్రయాణానికి సిద్ధంచేసేందుకుగాను ఎంతో చెపుతుంది. ఆ తరువాత ఆగే ప్రశ్న లేదు.
ఒక విషయం గురించి పుస్తకం రాయాలన్నా, చివరికి అనువాదం చేయాలన్నా, విషయం గురించి చక్కని అవగాహన అవసరం. లేకుంటే, అనువాదం యాంత్రికంగా సాగుతుంది. పుస్తకం అసలు పేరు మొదటి పేజీలోనే ఉరుదూ అక్షరాలలో వేశారు. కానీ, ఇంటర్‌నెట్ పుణ్యమా అని లోపలి పేజీలో అర్థంలేని మాట రాశారు. దర్వేష్‌ను ఇంగ్లీష్‌లో డెర్విష్ అని రాస్తారు. సైనాయ్, టర్కీజావియా, భాన్‌గాహ్, జికర్ లాంటి మాటలు అనువాదకునికి పరిచయం లేవని అర్థం. ధీధిచులు, ఉల్లూకము లాంటి మాటలు మరోరకం అనుమానానికి దారితీస్తాయి. తెలుగు అనువాదంలో కృతకమయిన భాష ఉండడానికి, మూల రచనే కారణం. అందుకే పుస్తకాలకు విషయం తెలిసిన సంపాదకులు అవసరం!
ఎన్ని లోపాలున్నా, అసలు రచన మహత్తరమయినది. అది చదివింప జేస్తుంది. పాఠకుడిని పట్టి ఆలోచనలోకి తోస్తుంది. ఇత్ అంటే సెంట్. అంటే సువాసన ద్రవం. అత్తర్ అంటే వాటిని అమ్మే మనిషి. పరీదుద్దీన్ సుగంధాల వ్యాపారి. ఆయన ఆలోచనలు అంతకన్నా ఘాటయిన వాసన గలవి. అందరినీ అలుముకున్నాయి మీరూ వాడి చూడండి!

-గోపాలం.కె.బి.