తెలంగాణ

వృద్ధి రేటును పెంచే బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 17: రానున్న ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రానున్న మూడేళ్లలో తెలంగాణలో వృద్ధి రేటు, తలసరి ఆదాయాన్ని పెంపొందించేలా ఉందని టిఆర్‌ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శాసన మండలిలో బిజెపి సభ్యుడు రామచంద్రరావు విమర్శలకు ధీటుగా స్పందించిన ఆయన, బడ్జెట్‌పై మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ వాస్తవిక అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని అనేక వర్గాలతో నెలరోజుల పాటు సంప్రదింపులు జరుపుతూ, కేటాయింపులు కనీసం తొంభై నుంచి 96 శాతం వరకు వెచ్చించేలా బడ్జెట్‌ను తయారు చేశారన్నారు. ఇప్పటి వరకు ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనూ బడ్జెట్‌లో జరిపిన కేటాయింపులు నూటికి నూరు శాతం వెచ్చించిన సందర్భాల్లేవన్న విషయాన్ని గుర్తించి విపక్ష సభ్యులు వ్యవహరించాలని సూచించారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రతిసారి అంకెలగారడీ అని వ్యాఖ్యానించటం విపక్షాలకు అలవాటైపోయిందని వ్యాఖ్యానించారు. అన్ని రంగాలకు గత సంవత్సరం కన్నా ఈసారి బడ్జెట్‌లో ఎక్కువ కేటాయింపులు జరిపారన్నారు. ఈ బడ్జెట్‌లో సాగునీటికి వెచ్చించే నిధులతో వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి కల్లా సుమారు 25వేల ఎకరాలకు నీటిని అందించటం మామూలు విషయం కాదన్నారు. అంతేగాక, మిషన్ భగీరథ పథకం ద్వారా వచ్చే సంవత్సరం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి నీటిని అందించే అవకాశముందన్నారు. పల్లా ప్రసంగం అనంతరం చైర్మన్ స్వామిగౌడ్ సమావేశాన్ని నేటి ఉదయం పది గంటలకు వాయిదా వేశారు.