తెలంగాణ

పాలమూరును అడ్డుకుంటే గుణపాఠం ఖాయం: హరీష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: పాలమూరు-రంగారెడ్డి సాగునీటి పథకాన్ని గడువులోగా పూర్తి చేసి రికార్డు సృష్టిస్తామని, ఈ ప్రాజెక్టును అడ్డుకునే పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆయన శుక్రవారం పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడుతూ, దీన్ని అడ్డుకునేందుకు ఎపి సిఎం కేంద్రానికి పూటకో లేఖ రాస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని రాజకీయాలు చేసినా నీటి పారుదల ప్రాజెక్టులను అనుకున్న విధంగా పూర్తిచేస్తామన్నారు.